
పసిడి ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మొన్నటివరకు ధరలు భారీగా పడిపోగా.. ప్రస్తుతం మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. ధంతేరాస్, దీపావళి సమీపిస్తుండటంతో బంగారంకు డిమాండ్ పెరుగుతోంది. పండుగల వేళ బంగారం కొనేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో పసిడి ధరలు ఉన్నట్లుండి ఎగబాకుతున్నాయి. పండుగ డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని, ధరలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నవంబర్ 3న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,380 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,760 పలుకుతోంది.
-హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,380కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,760 వద్ద కొనసాగుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,39,380 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,760గా ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,530 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,910గా కొనసాగుతోంది
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,380గా ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,760 వద్ద కొనసాగుతోంది
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,380 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,760 వద్ద కొనసాగుతోంది
-బంగారంతో పోలిస్తే వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు ఇవాళ స్వల్పంగా పడిపోయాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.1,99,900 పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,99,900 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ..1,99,900గా ఉంది
గత నెలలో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. గోల్డ్ ప్యూచర్స్ దాదాపు 7 శాతం పతనమవ్వగా.. సిల్వర్ ధరలు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. బంగారం కంటే మూడు రేట్లు అదనంగా సిల్వర్ ధర డౌన్ అయింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు, ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ మార్కెట్లలో ఒత్తిడి వల్ల ధరలు క్రాష్ అయ్యాయి. అయితే పండుగ డిమాండ్ కారణంగా ఈ వారం ప్రారంభం సోమవారం నుంచి ధరలు పెరుగుదలను చవిచూస్తున్నాయి. పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్న క్రమంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.