Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold price today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
gold
Follow us

|

Updated on: Jan 03, 2022 | 5:10 AM

Gold price today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  సోమవారం (జనవరి 3) న దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,610 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,940 వద్ద ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,160 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,160వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 వద్ద కొనసాగుతోంది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద కొనసాగుతోంది.

* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద కొనసాగుతోంది.

Read Also..  పెన్షన్‌దారులు, బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మార్చి వరకు అవకాశం..