Gold Price Today
దేశంలో ప్రతి రోజు పసిడి ధరలలో మార్పులు ఉండటనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్లో మాత్రం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జోరుగా విక్రయాలు కొనసాగుతుంటాయి. అయితే తాజాగా ఆదివారం దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.400 నుంచి రూ.430 వరకు పెరిగింది. ఇక పసిడి ధర పెరిగితే వెండి ధర తగ్గింది. కిలోపై రూ.200 వరకు తగ్గింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
- తెలంగాణలోని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద ఉంది.
- ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 ఉంది.
- తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద ఉంది.
- మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750
- పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,630 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 వద్ద ఉంది.
వెండి ధరలు:
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500 ఉంటే విజయవాడ, చెన్నైలో ఇదే ధర ఉంది. ఇక ముంబై, ఢిల్లీ నగరాల్లో రూ.61,700 ఉంది. కోల్కతాలో రూ.67,700, బెంగళూరు, కేరళలలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి