Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశంలో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..!

|

Dec 06, 2021 | 5:58 AM

Gold Price Today: మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో..

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశంలో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..!
Follow us on

Gold Price Today: మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ఇక చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ధరలు ఒక పెరిగి పెరిగితే ఒక రోజు తగ్గుతుంది.. లేకపోతే స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక తాజాగా సోమవారం (డిసెంబర్‌ 6)న దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల భారీగా పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగానూ, మరి కొన్ని నగరాల్లో భారీగా, మరి కొన్ని నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. మొత్తం మీద దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా పెరిగింది. తాజాగా దేశీయంగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,830గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Car prices: వచ్చే ఏడాది బాదుడే.. బాదుడు.. మరింత పెరగనున్న కార్ల ధరలు..!

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!