Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర.. వెండి ఎంతో తెలుసా..?

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు రోజూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ వస్తుండటంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు..

Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర.. వెండి ఎంతో తెలుసా..?
Today Gold Rates

Updated on: Jan 30, 2026 | 6:39 AM

Gold Price Today: బంగారం, వెండి ధరలకు అంతే లేకుండా పోతోంది. జెడ్‌స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. రోజురోజుకు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రాము ధర కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు రానున్నది పెళ్లిళ్ల సీజన్‌. ఇంకా ఎంత పెరుగుతోందనని మహిళలు భయపడిపోతున్నారు. ప్రతి రోజు బంగారం, వెండి ధరలు పెరగడం తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. తగ్గినప్పుడు పదుల సంఖ్యలోనే తగ్గుతోంది. కానీ పెరిగినప్పుడు వేలల్లో పెరుగుతోంది.

జనవరి 30వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,960 ఉంది. అయితే నిన్న ఒక్క రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,82,490 ఉండగా, ఇప్పుడు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950గా ఉండేది. అయితే తులం ధర 2 లక్షలకు చేరుకునేందుకు ఎంతో దూరం లేదు. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు:

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,960 ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,960 ఉంది.

ఇతర నగరాల్లో..

  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,79,010ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,110 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,960 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,83,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,68,010 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,960 ఉంది.
  • ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.4,25,100 ఉంది.

ఈ ఏడాది జనవరి నెలలో కేవలం 28 రోజుల్లోనే వెండి ధర రూ.127,847 పెరిగింది. డిసెంబర్ 31, 2025న ఒక కిలో వెండి ధర రూ.230,420గా ఉంది. అది ఇప్పుడు కిలోగ్రాముకు రూ.4,25,100కు చేరుకుంది. బంగారం ధర రూ.30,632 పెరిగింది. డిసెంబర్ 31, 2025న, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,195గా ఉండగా, ఇప్పుడు అది రూ.1,78,000 దాటేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను విలీనం చేసుకోవాలని పట్టుబట్టడం, ఈ అంశంపై యూరోపియన్ దేశాలపై సుంకాలు విధించాలని ఆయన బెదిరించడం ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి.

ప్రపంచ వాణిజ్య యుద్ధ ముప్పు పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం వంటి సురక్షిత స్వర్గధామాలకు పారిపోతారు. భారతదేశంలో బంగారం ధరలు ప్రపంచ ధరలపై మాత్రమే కాకుండా డాలర్-రూపాయి మారకం రేటుపై కూడా ఆధారపడి ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంటుంది.

మరిన్నిబిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి