Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

రోజు రోజుకు పుత్తడి ధర పెరిగిపోతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ఉంది కాబట్టి బంగారం ధర పెరుగుతూనేఉంది. అయితే బంగారం ధర పెరిగేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రతి రోజు గోల్డ్‌ ధరలు వెలువడుతుంటాయి. తాజాగా 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటుపై స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలోనీ ప్రధాన ప్రాంతాల్లో మార్చి 7వ తేదీన గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరను పరిశీలించినట్లయితే..

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
Gold Price

Updated on: Mar 07, 2024 | 6:20 AM

రోజు రోజుకు పుత్తడి ధర పెరిగిపోతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ఉంది కాబట్టి బంగారం ధర పెరుగుతూనేఉంది. అయితే బంగారం ధర పెరిగేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రతి రోజు గోల్డ్‌ ధరలు వెలువడుతుంటాయి. తాజాగా 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటుపై స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలోనీ ప్రధాన ప్రాంతాల్లో మార్చి 7వ తేదీన గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరను పరిశీలించినట్లయితే 60 వేల 410 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల పది గ్రాముల ధరను పరిశీలిస్తే 65 వేల 900 రూపాయల వరకు ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 59 వేల 710 రూపాయల వద్ద ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 65 వేల 140 రూపాయల వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 59 వేల 860 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 59 వేల 860 రూపాయాలు ఉండగా, కోల్‌కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల రేటు 59 వేల 710 రూపాయల వరకు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 65 వేల 140 ఉంది. అదే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌లో అయితే 22 క్యారెట్ల పది గ్రాముల ధర 59 వేల710 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 65 వేల 140 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధర 74వేల 400 రూపాయాలు ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి