ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న బంగారం ధరలకు గురువారం కాస్త బ్రేక్ పడింది. గడిచిన కొన్ని రోజులుగా పెరగడం తప్ప, తగ్గడం లేదన్నట్లూ దూసుకుపోయిన బంగారం ధర గురువారం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధర తగ్గింది. అయితే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరతో పోల్చితే ఇది తక్కువేనని చెప్పాలి.
గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 తగ్గింది దీంతో తులం బంగారం ధర రూ. 58,500కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 270 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ తగ్గుదల తాత్కలికమేనని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర పరుగులు పెట్టడం ఖాయమని చెబుతున్నారు. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ. 58,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500కాగా, 24 క్యారెట్ల ధర రూ. 63,820 వద్ద కొనసాగుతోంది. అదే విధనంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,150గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,530గా ఉంది. ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,820 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,820కి చేరింది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,820కి చేరింది.
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తున్నాయి. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలోనూ తగ్గుముఖం కనిపించింది. ఒకేరోజు కిలో వెండి రూ. 300 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 78,600కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో గురువారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో కిలో వెండి ధర రూ. 78,600 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..