Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గతంలో ఎన్నడూ లేనంతగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ధరలు కొంతమేర తగ్గి ఉపశమనాన్ని కలిగించాయి.. ఆల్ టైం రికార్డుకు చేరిన ధరలు.. తగ్గడంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆసత్తి చూపుతున్నారు.

Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price

Updated on: Jun 30, 2024 | 6:37 AM

గతంలో ఎన్నడూ లేనంతగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ధరలు కొంతమేర తగ్గి ఉపశమనాన్ని కలిగించాయి.. ఆల్ టైం రికార్డుకు చేరిన ధరలు.. తగ్గడంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (జూన్ 30 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 72,280 గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 66,250 గా ఉంది.. వెండి ధర కిలో రూ.90,000లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

తెలుగు రాష్ట్రాల్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్స్ మారుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,280గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,280గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400, 24 క్యారెట్ల ధర రూ.72,420 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.66,250, 24 క్యారెట్లు రూ.72,280, చెన్నైలో 22క్యారెట్లు రూ.66,850, 24 క్యారెట్లు రూ.72,930, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.66,250, 24 క్యారెట్లు రూ.72,280గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.90,000, ముంబైలో రూ.90,000, బెంగళూరులో రూ.90,500, చెన్నైలో రూ.94,500, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.94,500 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us