Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

|

Feb 20, 2021 | 9:29 AM

Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఒకనొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Follow us on

Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. అయితే ఇది చాలా స్వల్పమనే చెప్పాలి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు పతనమవుతున్నాయి. శనివారం కూడా దేశీయ మార్కెట్లో బంగారు ధరలు తగ్గాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర వివరాలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం శుక్రవారంతో పోలిస్తే రూ.10 తగ్గి, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,140 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి.. రూ.49,270వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10 తగ్గి, రూ.45,120 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,120 వద్ద ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర నిన్నటితో పోలిస్తే రూ.20 తగ్గి, రూ.42,990 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,890గా ఉంది. విజయవాడలోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,990 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.450 తగ్గి, రూ.46,900 వద్ద ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.43,000గా నమోదైంది. 24 క్యారెట్ల విషయానికొస్తే రూ.10 తగ్గి.. రూ. 46,890 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.43,470 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,390 వద్ద కొనసాగుతోంది.

Also Read: Petrol Diesel Price Today: పెట్రోల్‌ ధరల దూకుడుకు అడ్డుకట్ట పడేదెన్నడు..? వరుసగా 12వ రోజు పెరిగిన ధరలు..