దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక పెట్టుబడి పెట్టేవారి విషయంలోనూ ఇలాంటి వాతావరణమే నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, వడ్డీ రేట్లలో మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరిసి పసిడి ధరలు పెరుగుదలకు కారణం అవుతోంది. ఉగాది పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి పసిడి ధరలు.
ఇక ఏప్రియల్ రెండవ వారంలో వరుసగా నాలుగు రోజులు బంగారం ధర పెరుగుతూ వస్తోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 72,110 కాగా ఈరోజు రూ. 72,120. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 66,100 కాగా ఈరోజు రూ. 66,110 కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర నిన్న రూ. 89,000 కాగా ఈరోజు రూ. 89,100 వద్ద కొనసాగుతోంది. అంటే కిలోపై రూ. 100 పెరిగింది. అలాగే దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఎంత ధర పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..