Gold-Silver Rates Today : మహిళలకు బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

|

Apr 10, 2021 | 5:26 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Gold-Silver Rates Today : మహిళలకు బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..!
Follow us on

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా శనివారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.10 పెరిగి.. 45,160 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,260 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,560 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,560 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,500 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,870 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,500 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 72,100 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 72,100 గా ఉంది.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..