
పసిడి ప్రియులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6గంటల నుంచి 10 గంటల మధ్యలోనే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. జస్ట్ 4గంటల్లో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.810 తగ్గింది.

సోమవారం ఉదయం ధరల్లో హెచ్చతగ్గుల తర్వాత హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280గా ఉండగా ఉదయం ఈ ధర 1,48,080 వద్ద స్థరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఉదయం 6గంటలకు రూ.1,35,740గా ఉన్న తులం బంగారం ధర రూ. ప్రస్తుతం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280గా కొనసాగుతుండగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,000 వద్ద స్థిరపడింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,430గా ఉండగా ఉదయం ఈ ధర రూ. 1,48,080 వద్ద కొనసాగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఉదయం రూ.1,35,740 వద్ద ఉండగా ప్రస్తుతం రూ.135,150 వద్ద స్థిరపడింది. ఇక చెన్నైలోనూ తులం బంగారం ధర ప్రస్తుతం రూ.1,48,370 వద్ద కొనసాగుతుంది.

ఇక వెండి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా బంగారం బాటలోనే నడుస్తూ తగ్గుముఖం పట్టిన వెండి సోమవారం స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుంది.