Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

నిన్నమొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. శుక్రవారం (అక్టోబర్‌21) స్వల్పంగా దిగి వచ్చింది.10 గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గింది.

Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold And Silver Price Today

Updated on: Oct 21, 2022 | 6:30 AM

బులియన్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి.నిన్నమొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. శుక్రవారం (అక్టోబర్‌21) స్వల్పంగా దిగి వచ్చింది.10 గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గింది. మారిన ధరలతో శుక్రవారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,350 వద్ద లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,560 పలుకుతోంది. ఇక ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.250 తగ్గడంతో రూ. 56,150 గా ఉంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,560 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా కొనసాగుతోంది.

 వెండి ధరలిలా..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,150 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.56,150, చెన్నైలో కిలో వెండి ధర రూ.61,000, బెంగళూరులో రూ.56,150 హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,000, విజయవాడలో రూ.61,000, విశాఖపట్నంలో రూ.61,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us