ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది.. ఎందుకంటే దేనికైనా ఆధారే ఆధారం కాబట్టి.. కానీ మన ఆధార్ ఎంతవరకు భద్రంగా ఉంచుకుంటున్నాం. పలు సందర్భాల్లో వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ వివరాలకు ముంపు పొంచి ఉందని గుర్తించాలి. ప్రస్తుతం సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి.
సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నాల్లో భాగంగా మన ఆధార్ కార్డు, పాన్ కార్డ్ వివరాలతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేంస్తుంటారు. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ముందుగా మీ ఆధార్, పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.
మీరు మెయిల్ పంపించి ప్రింట్ తీసుకుంటారు. కానీ దాన్ని డిలీట్ చేయించాలి. ఎందుకంటే మన ఆధార్ ఉపయోగించి మోసాలకు పాల్పడతారు. లేదా డేటాను అమ్ముకుంటారు. అనుమానంగా ఉన్న వెబ్ సైట్లలో ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చెయ్యొద్దు. అప్లోడ్ కూడా చేయొద్దు. మీరు మీ సిబిల్ స్కోర్‌ను ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి.
సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీకు తెలియకుండా ఇతరులు ఎవరైనా ఆధార్ కార్డ్ సాయంతో అప్పులు తీసుకనే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మీకు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ షేర్ చేయొద్దు.
ఆధార్ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు ఇస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్‌ను సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
Read Also.. Semiconductors: వేధిస్తున్న సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా గ్రూప్ ప్రయత్నాలకు ఆటంకం..!