EPFO: మీ పీఎఫ్ ఖాతా చాలా ఏళ్లుగా మూతబడి ఉందా?.. అయితే మీకు ఇది శుభవార్తే..

EPFO మాజీ ఖాతాదారులకు శుభవార్త అందించనుంది ఆ సంస్థ. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ నుంచి ఉపసంహరించుకున్న సభ్యులు రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా ఖాతాని మళ్లీ ప్రారంభించేందకు అవకాశం ఉంది. నెలలో కనీసం రూ. 500 చెల్లించి EPFO ​సబ్‌స్క్రిప్షన్ పునఃప్రారంభించవలసి ఉంటుంది...

EPFO: మీ పీఎఫ్ ఖాతా చాలా ఏళ్లుగా మూతబడి ఉందా?.. అయితే మీకు ఇది శుభవార్తే..
Epfo

Updated on: Nov 28, 2021 | 7:21 AM

EPFO మాజీ ఖాతాదారులకు శుభవార్త అందించనుంది ఆ సంస్థ. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ నుంచి ఉపసంహరించుకున్న సభ్యులు రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా ఖాతాని మళ్లీ ప్రారంభించేందకు అవకాశం ఉంది. నెలలో కనీసం రూ. 500 చెల్లించి EPFO ​సబ్‌స్క్రిప్షన్ పునఃప్రారంభించవలసి ఉంటుంది. ఈ అవకాశం ఉద్యోగాన్ని విడిచిపెట్టి, PF ఖాతా మూసివేసిన వారికి ఉంటుంది. గతంలో ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా ఉండి, కొన్ని కారణాల వల్ల పీఎఫ్‌ నుంచి బయటికి వచ్చిన వారు నెలలో కనీసం రూ.500 చెల్లించి మళ్లీ చేరవచ్చు. వారు తమ నెలవారీ సంపాదనలో రూ. 500 లేదా 13% చెల్లించి EPFOలో చేరవచ్చు.

2018-20 మధ్యకాలంలో దాదాపు 48 లక్షల మంది ఈ సంస్థ నుంచి బయటపడ్డారని EPFO ​​అంచనా వేసింది. ఈ వ్యక్తుల డేటాబేస్‌లు EPFO ​​వద్ద ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 సంవత్సరంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఈపీఎఫ్‌వో కొత్త రూల్‌ వస్తే లక్షలాది మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. EPFO వద్ద నిష్క్రమించిన ఉద్యోగులందరి డేటా ఉంది, అందరికీ యూనివర్సల్ ఖాతా నంబర్ ఉంటుంది. ఈ నంబర్లన్నీ ఆధార్‌తో అనుసంధానించారు. దీంతో పాత ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం సులభతరం అవుతుంది.

ఈ నిబంధన వర్తింపజేస్తే, పాత ఉద్యోగులు తమ పదవీ విరమణ నిధిని పెంచుకోవచ్చు. PFపై రాబడులు ఇతర డిపాజిట్ పథకం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరిన వారికి పెన్షన్, పీఎఫ్, ఇన్సూరెన్స్ కలిసి అందుతాయి. దీనితోపాటు డిపాజిట్ చేసిన మొత్తానికి నిర్ణీత రేటుతో వడ్డీ కూడా లభిస్తుంది.

Read Also.. Star Health IPO: నవంబర్ 30న స్టార్ హెల్త్ ఐపీఓ.. షేరు ధర రూ.870-900..

Loading...
Unable to load recommendations.
Follow Us