Portable AC: చలచల్లని.. కూల్.. కూల్.! ఈ పోర్టబుల్ ఏసీని ఇప్పుడే కొనేయండి.. ఆఫర్ కొద్దిరోజులే..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సూర్యుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుపైగా నమోదవుతుండటంతో..

Portable AC: చలచల్లని.. కూల్.. కూల్.! ఈ పోర్టబుల్ ఏసీని ఇప్పుడే కొనేయండి.. ఆఫర్ కొద్దిరోజులే..
Portable Ac

Updated on: May 24, 2023 | 12:38 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సూర్యుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుపైగా నమోదవుతుండటంతో.. ప్రతీ ఒక్కరూ ఎండల తాపాన్ని తట్టుకునేందుకు తమ ఇళ్లల్లో కూలర్, ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఎయిర్ కండీషనర్ల వినియోగం వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ వ్యయాన్ని తగ్గించేందుకు తక్కువ ధరలో.. చౌకైన పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ఎక్కడైనా పెట్టొచ్చు. క్షణాల్లో మీ గదిని కశ్మీర్‌లా మార్చేస్తుంది. మరి మేము షార్ట్‌లిస్టు చేసిన ఓ పోర్టబుల్ ఏసీ(ఎయిర్ కూలర్) గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్మకానికి ఉంది. దీని ధర రూ. 7,671 కాగా, ఇందులో ఈఎంఐ ఆప్షన్ సౌకర్యం కూడా ఉంది. మీరు నెలకు రూ. 367 కడితే చాలు.. పోర్టబుల్ ఏసీ(ఎయిర్ కూలర్)ని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక దీని ఫీచర్స్ చూస్తే.. ఇందులో అమర్చబడిన ఫ్యాన్‌ స్పీడ్‌ను 3 మోడ్స్‌(లో, మిడిల్, హై)లో అడ్జస్ట్ చేయవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీలో అమర్చబడిన వాటర్ ట్యాంక్‌ను ఒక్కసారి నీళ్లతో నింపితే.. సుమారు 8 గంటల వరకు ఉపయోగించవచ్చు.

దీనికి యూఎస్‌బీ కేబుల్‌ లభిస్తోంది. దాని ద్వారా కంప్యూటర్, ఛార్జర్, పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అటు ఈ పోర్టబుల్ ఏసీ(ఎయిర్ కూలర్)లో ఉన్న నైట్ లైట్‌ 7 రంగుల్లో కనిపిస్తుంది. అలాగే ఇందులో ఉన్న ప్రత్యేక సాంకేతికత దీని నుంచి తక్కువ శబ్దం వచ్చేలా చేస్తుంది. దీన్ని మీరు ఎక్కడైనా వాడొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పెద్దగా బరువు కూడా ఉండదు.(Source)

Loading...
Unable to load recommendations.
Follow Us