మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మన దేశ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన ఈమొబి స్టార్టప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ రానుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీ ఫోకస్ పెడుతూ ఈమొబి క్యారీ పేరిట కొత్త బైక్ లాంచ్ కానుంది. అయితే ఈ గ్రాండ్ లాంచ్ కన్నా ముందే భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2024లో దీనిని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ కొత్త ఈవీ స్వాపబుల్ బ్యాటరీలతో బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక ఈ స్టార్టప్ వాహనాల తయారీ, నెట్ వర్క్ ఏర్పాటు కోసం హోండా, ముసాషీ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.
ఈమొబీ క్యారీ బైక్ డిజైన్ విలక్షణంగా ఉంటుంది. పొడవైన ఫ్లాట్ సీటు రైడర్ కు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే రైడర్ వెనకాల ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి కార్గో రవాణాకు కూడా సరిగ్గా సరిపోతుంది. దీని హెడ్ ల్యాంప్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ బైక్ కొలతలు చూస్తే 1870ఎంఎం పొడవు, 1010ఎంఎం ఎత్తు, 705ఎంఎం వెడల్పు ఉంటుంది.
ఈ బైక్ మెకానిక్స్ గురించి మాట్లాడితే దీనిలో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తే ఈ బైక్‌లో 1.3కేడబ్ల్యూహెచ్ ఈ-స్వాప్ బ్యాటరీలు ఉంటాయి. జపనీస్ బ్రాండ్ చార్జింగ్ నెట్ వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. 4.2కేడబ్ల్యూ స్పిండిల్ మోటార్ 18.7 గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. వీటి సాయంతో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అదే సమయంలో సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.
దీనిలో స్టోరేజ్ స్పేస్ ఎక్కువగ ఉండటం వల్ల ఇది వ్యాపారులకు సరిగ్గా సరిపోతుంది. వెనుకాల సీటు పక్కన అటువైపు ఇటు వైపు క్యారియర్లు వినియోగించుకోదగని సెటప్ ఉంటుంది. ఇది వ్యాపారులకు చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది. అలాగే పాల వ్యాపారులు, డ్రింకింగ్ వాటర్ వ్యాపారులకు కూడా ఇది బాగా సరిపోతుంది. దీని ధర కూడా అనువైన విధంగా ఉండటంతో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బైక్ ముందు వైపు కూడా లగేజీ పెట్టుకునేందుకు అనువైన స్థలం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..