Elon Musk: టీనేజర్‌తో ఎలన్ మస్క్ బేరసారాలు.! అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. కథేంటో తెలిస్తే షాకే..

Elon Musk: టీనేజర్‌తో ఎలన్ మస్క్ బేరసారాలు.! అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. కథేంటో తెలిస్తే  షాకే..
Elon Musk

ఎవరి జీవితాన్నైనా ఒక్క ట్వీట్‌తో మార్చేయగల ఎలన్ మస్క్.. తాజాగా ఓ టీనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడట. ఒకటి అనుకుంటే..

Ravi Kiran

|

Jan 28, 2022 | 7:19 PM

ఎలన్ మస్క్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ప్రపంచ కుబేరాల్లో ఈయనే కింగూ. మస్క్ ఏం చేసినా అదొక సంచలనమే. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు ఈయనతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఎవరి జీవితాన్నైనా ఒక్క ట్వీట్‌తో మార్చేయగల ఎలన్ మస్క్.. తాజాగా ఓ టీనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడట. ఎలన్ మస్క్ ఒకటి అనుకుంటే.. అక్కడ వేరొకటి జరగడంతో టెక్ పండితుడు సైలెంట్‌గా వెనకడుగు వెయ్యాల్సి వచ్చిందట. ఏంటి.! మస్క్ టీజేజర్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడా.? ఇది నమ్మశక్యంగా లేదే.? అని ఆశ్చర్యపోకండి.. ఈ స్టోరీ చదవితే మీకే తెలుస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుల్లో ఒకరైన ఎలన్ మస్క్.. తన బిజినెస్ పనులపై ఎలప్పుడూ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తుంటాడు. ఇందులో ఏముంది.. అపర కుబేరుడు.. అత్యంత ధనవంతుడు.. కచ్చితంగా ప్రైవేట్ జెట్ ఉంటుంది అనుకునేరు. కథ అదికాదండీ.! సాధారణంగా ఇలాంటి బిజినెస్ టైకూన్స్ తమ సెక్యూరిటీ దృష్ట్యా విమాన ప్రయాణాలకు సంబంధించిన వివరాలన్నింటినీ మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. కానీ ఎలన్ మస్క్ తన ట్రావెల్ హిస్టరీని ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్న.. అది బయటికి పొక్కుతూనే ఉంది. ఎందుకంటే.. 19 సంవత్సరాల జాక్ స్వీన్ అనే కాలేజీ స్టూడెంట్.. ఎలన్ మస్క్‌తో సహా పలువురు ప్రముఖుల(బిల్ గేట్స్, జెఫ్ బిజోస్) ఫ్లైట్ హిస్టరీల ప్రైవేటు డేటాపై ట్విట్టర్ వేదికగా నిఘా ఉంచుతున్నాడు. ‘Elon Musk’s Jet‘ అంటూ మస్క్ ప్రైవేట్ జెట్ ఎప్పుడెప్పుడూ ఏయే ప్రాంతాలకు వెళ్తుందో సమాచారాన్ని ముందుగానే కనుగొని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ఇక ఈ ఖాతాకే ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక ఈ విషయం ఎలన్ మస్క్ దాకా వెళ్ళడంతో ఆ కుర్రాడితో బేరసారాలకు దిగాడు.

ఆ ట్విట్టర్ అకౌంట్‌కు గతేడాది ఎలన్ మస్క్ మెసేజ్‌లు పంపి.. తన ప్రైవేటు జెట్‌ను ట్రాక్ చేయడం ఆపేస్తే.. 5 వేల డాలర్లు(భారత కరెన్సీలో అక్షరాల రూ. 3.75 లక్షలు) ఇస్తానంటూ స్వీన్‌కు మస్క్ ఆఫర్ చేశాడట. ఆ అమౌంట్ తక్కువ అని.. బదులుగా 50 వేల డాలర్లు(మన కరెన్సీలో రూ. 37.55 లక్షలు) ఇవ్వాలంటూ స్వీన్ అడిగాడట. ఈ డబ్బు ద్వారా తాను మంచి కాలేజీలో చదువుకోవడమే కాకుండా తనకిష్టమైన టెస్లా కారును కొనుగోలు చేసుకోవాలనే కోరిక నెరవేరుతుందని స్వీన్ తెలిపాడట. స్వీన్ ఆఫర్‌కు ముందుగా ‘అలోచిస్తానని’ చెప్పిన మస్క్.. ఆ తర్వాత ఇంత మొత్తాన్ని ఇచ్చి అకౌంట్ మూసివేయడం కరెక్ట్ కాదేమోనని అనుకున్న మస్క్.. అతడికి మళ్లీ మెసేజ్‌లు చేయలేదట. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా ‘New York Post‘తో పంచుకున్న స్వీన్.. మస్క్ తనతో కాంటాక్ట్ కావడం సంతోషంగానూ, కొంచెం భయంగానూ ఉందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మస్క్ కంపెనీల్లో ఏదొక దానిలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu