Business Ideas: ఈ దీపావళి సీజన్‌ను తెలివిగా వాడుకోండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోండి.

|

Oct 26, 2023 | 9:04 AM

దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్‌ నడుస్తోంది. దసరా నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే దీపావళి సీజన్‌ మొదలైంది. ఇక దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది దీపాలు, క్యాండీల్స్‌. ఇక దీపావళి ముగిసిన వెంటనే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమవుతాయి. క్రిస్మస్‌ వేడుకల్లోనూ కొవ్వొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ సీజన్‌లో క్యాండీళ్లను తయారు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా...

Business Ideas: ఈ దీపావళి సీజన్‌ను తెలివిగా వాడుకోండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోండి.
Business Idea
Follow us on

తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే బిజినెస్‌ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. తెలివితో ఆలోచిస్తే ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఇక సీజనల్‌ వ్యాపారాలు కూడా మంచి ఆదాయ వనరుగా చెప్పొచ్చు. పండగల సీజన్‌ను టార్గెట్ చేసుకొని చేసే వ్యాపారాలు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. ఇలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్‌ నడుస్తోంది. దసరా నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే దీపావళి సీజన్‌ మొదలైంది. ఇక దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది దీపాలు, క్యాండీల్స్‌. ఇక దీపావళి ముగిసిన వెంటనే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమవుతాయి. క్రిస్మస్‌ వేడుకల్లోనూ కొవ్వొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ సీజన్‌లో క్యాండీళ్లను తయారు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసే క్యాండీల్స్‌తో మంచి ఆదాయాన్ని పొందొచ్చు.

తక్కువ పెట్టుబడితో క్యాండిల్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. రంగు రంగుల క్యాండీల్స్‌, విభిన్న ఆకరాల్లో ఉండే క్యాండిల్స్‌ను తయారు చేయడం ద్వారా వినియోగారులను అట్రాక్ట్ చేయొచ్చు. కేవలం రూ. 10 నుంచి రూ. 15 వేల పెట్టుబడితోనే ఈ క్యాండీల్స్‌ను తయారు చేయొచ్చు. ఇక క్యాండీల్స్‌ తయారీకి అవసరమయ్యే ముడి సరకులు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో లభిస్తున్నాయి. ఇక కొవ్వొత్తులను తయారు చేయడానికి చిన్న చిన్న అచ్చు యంత్రాలు ఉంటాయి. వాటితో సులభంగా ఇంట్లోనే క్యాండీల్స్‌ను తయారు చేసకోవచ్చు.

సాధారణంగా క్యాండీల్స్‌ కోసం మైనం, దారం, రంగుతో పాటు ఈథర్‌ ఆయిల్‌ అవసరపడతాయి. వీటితోపాటు క్యాండీల్స్‌ సువాసన రావాలంటే అందుకోసం అవసరమయ్యే ఆయిల్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక కొవ్వుత్తుల అమ్మకాలు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ మిషన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. దీని సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ క్యాండీల్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్‌ ధర కనీసం రూ. 35,000గా ఉంటుంది. సెమీ, మాన్యువల్‌, ఫుల్‌ ఆటోమెటిగ్‌ రకాల్లో ఈ మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ మిషన్‌ సహాయంతో ప్రతీ గంటకు 1800 కొవ్వుత్తులను తయారు చేసుకోవచ్చు. ఇక పూర్తిగా ఆటోమేటెడ్‌ మిషన్‌తో అయితే నిమిసానికి ఏకంగా 200 కొవ్వుత్తులను తయారు చేసుకోవచ్చు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్‌ కూడా అందిస్తోంది. వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికుల కోసం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. ఇక తయారు చేసిన కొవ్వొత్తులను మార్కెటింగ్ చేసుకోవాలి. నేరుగా దుకాణాల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లో క్యాండీల్స్‌ను అమ్ముకోవచ్చు. ఇటీవల ఈ కామర్స్‌ సైట్స్‌తో ఒప్పందం చేసుకొని వ్యాపారం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మీరు తయారు చేసిన క్యాండీల్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..