
E20 Fuel: దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ప్రవేశపెట్టారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాడకంపై మార్కెట్‌లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో E-20 పెట్రోల్ లభిస్తోంది. అయితే ఈ పెట్రోల్ వల్ల మైలేజీ తక్కువగా ఇస్తోంది.. వాహనాలపై ఎఫెక్ట్ పడుతుందని ఇలా రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రముఖ ఆటో పరిశ్రమ నిపుణులతో విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనిపై పలు పలు కీలక విషయాలను వెల్లడించారు. మారుతి, టయోటా, హీరో మోటోకార్ప్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నాయకులు E20 పూర్తిగా సురక్షితమైనదని స్పష్టం చేశారు. పాత కార్లపై (E10) కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని, మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉందని నిపుణులు అంగీకరించినప్పటికీ, భద్రత, ఇంజిన్ జీవితకాలం, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక గేమ్-ఛేంజర్ అని అభివర్ణించారు. పత్రికా సమావేశంలో అడిగిన టాప్ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం..
దీనిపై మారుతి సుజుకికి చెందిన రాహుల్ భారతి మాట్లాడుతూ.. “వినియోగదారులు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకికి విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. ఇటీవల తాము 2.84 లక్షల కార్లకు సర్వీస్ చేశాము. వాటిలో 1.5 కోట్ల కార్లు మూడేళ్ల కంటే పాతవి. E20 ఇంధనం కారణంగా ఇంజన్ తుప్పు పట్టడం, అరిగిపోవడం లేదా ఏవైనా భాగాలు దెబ్బతినడం వంటి ఒక్క కేసు కూడా మా డేటాలో వెల్లడి కాలేదు.” అని అన్నారు.
ఈ ప్రశ్నకు టయోటాకు చెందిన విక్రమ్ గులాటి సమాధానిమిస్తూ.. “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలపై మేము విచారణ జరిపాము. వాస్తవం ఏమిటంటే సమస్య E20 ఇంధనంతో కాదు, కల్తీ ఇంధనంతో ఉంది. వాహనం పెట్రోల్ ట్యాంక్‌లో నీరు కలిపి ఉన్నట్లు కనుగొన్నాము. తాము ట్యాంక్‌ను శుభ్రపరిచి, ప్రామాణికమైన E20 ఇంధనాన్ని నింపిన వెంటనే, వాహనంలోని ఏ భాగాలకూ ఎలాంటి నష్టం జరగకుండా సాధారణంగా నడవడం ప్రారంభించింది. ఇది కేవలం కల్తీకి సంబంధించిన కేసు మాత్రమే.” అని అన్నారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా మారుతి సుజుకికి చెందిన రాహుల్ భారతి మాట్లాడుతూ, “స్వచ్ఛమైన పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కెలోరిఫిక్ విలువ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందువల్ల E10తో పోలిస్తే E20 వాడకం వల్ల మైలేజీలో 3 నుండి 3.5% వరకు స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. అయితే, వాస్తవ మైలేజీ అనేది డ్రైవింగ్ శైలి, టైర్ ప్రెజర్, తరచుగా బ్రేకులు వేయడంపై కూడా ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో వాహనాలు 95 ఆక్టేన్ హై-కంప్రెషన్ ఇంజిన్‌లతో వచ్చినప్పుడు, ఈ 3% తగ్గుదల కూడా భర్తీ చేయబడుతుంది.” అని అన్నారు.
దీనిపై హీరో మోటోకార్ప్ ఇలా సమాధానం ఇచ్చింది. “తాము ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ, ఏటా 6 మిలియన్లకు పైగా బైక్‌లను విక్రయిస్తాము. మేము లక్షలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మా సర్వీస్ డేటాను సమీక్షించాము. E20 ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలలో వైఫల్యం లేదా నష్టం రేటు, E10 ఇంధనంతో నడిచే వాహనాల కంటే కొద్దిగా కూడా ఎక్కువగా లేదు. ద్విచక్ర వాహనాలు పూర్తిగా సురక్షితమైనవి.” అని అన్నారు.
దీనిపై EIL మాజీ CMD అయిన వర్తికా శుక్లా మాట్లాడుతూ.. ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దశలవారీగా జరిగిన ప్రక్రియ. 2013-14లో తాము కేవలం 1.5% ఇథనాల్‌ను మాత్రమే కలిపాము. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీలు, ARAI, SIAM ద్వారా విస్తృతమైన పరీక్షలు జరిపిన తర్వాత, E20 ఇప్పుడు దేశవ్యాప్తంగా 77,000కు పైగా రిటైల్ అవుట్‌లెట్లలో ఏకరీతిగా అందిస్తున్నట్లు చెప్పారు.
టయోటాకు చెందిన విక్రమ్ గులాటి తెలిపిన సమాధానం ప్రకారం, ప్రభుత్వం ఇటీవల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం E85 పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఏ నిష్పత్తిలోనైనా ఇథనాల్‌తో నడవగల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలదే భవిష్యత్తు. మోనో-ఫ్యూయల్ బేస్‌ను విస్తరించే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు.
టయోటాకు చెందిన విక్రమ్ గులాటి ప్రకారం, ఇథనాల్ ఒక జీరో-కార్బన్ స్వచ్ఛమైన ఇంధనం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇటీవల మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, దేశంలో 20% ఇథనాల్ కలపడం వల్ల సామాన్యుడి జేబుకు పెద్ద దెబ్బ తగలకుండా కాపాడింది. మనం ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నామని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి