Bike Sales: కొత్త బైక్ కొనే ప్లాన్ ఉందా.? అద్దిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ. 4 లక్షల తగ్గింపు!

కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా..? అయితే మీకోసం ఓ గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్‌తో కూడిన అద్దిరిపోయే ఆఫర్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అలా.. ఇలా కాదు.. ఏకంగా..

Bike Sales: కొత్త బైక్ కొనే ప్లాన్ ఉందా.? అద్దిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ. 4 లక్షల తగ్గింపు!
Bike Sales

Updated on: May 22, 2023 | 10:30 AM

కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా..? అయితే మీకోసం ఓ గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్‌తో కూడిన అద్దిరిపోయే ఆఫర్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అలా.. ఇలా కాదు.. ఏకంగా రూ. లక్షల్లో తగ్గింపు పొందొచ్చు. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ డుకాటీ తన తన మోడళ్లపై భారీ తగ్గింపు డీల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్‌ను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి4 ఎక్స్-షోరూమ్ ధర రూ.22.15 లక్షలు, డుకాటీ మల్టీస్ట్రాడా V4 ఎక్స్-షోరూమ్ ధర రూ.12.48 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై రూ.4 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అటు డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V2 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 18.10 లక్షలు, మల్టీస్ట్రాడా V2 ధర రూ. 16.05 లక్షలు, మాన్‌స్టర్ రూ. 12.95 లక్షలుగా ఉంది. వీటిపై రూ.2 లక్షల వరకు తగ్గింపు డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు ఉండొచ్చు.

డుకాటీ రాబోయే లైనప్..

నివేదికల ప్రకారం, డుకాటి ఇటీవలే భారతీయ మార్కెట్‌లో తన మాన్‌స్టర్ ఎస్‌పి మోడల్‌ను రూ. 15.95 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. మాన్‌స్టర్ SP ప్యాసింజర్ సీట్ కౌల్, ఓహ్లిన్స్ సోర్స్డ్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తోంది. ఇది భారతదేశంలో కవాసకి Z900, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, BMW F900Rలకు పోటీనిస్తోంది. డుకాటీ రాబోయే లైనప్‌లో హైపర్‌మోటార్డ్, పానిగేల్, సూపర్‌స్పోర్ట్, XDiavel, Hypermotard, DesertX, స్క్రాంబ్లర్ మోడళ్లు ఉన్నాయి.