Indian Railways: దీపావళికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. 22 ప్రత్యేక రైళ్లు ప్రకటన.. ఈ మార్గంలోనే..

దీపావళి సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ఇవి తిరగనున్నాయి. మొత్తం 22 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Indian Railways: దీపావళికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. 22 ప్రత్యేక రైళ్లు ప్రకటన.. ఈ మార్గంలోనే..
Indian Railways

Updated on: Oct 26, 2026 | 7:41 AM

దీపావళి సందర్భంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. దీంతో రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుగానే చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రత్యేక రైళ్లను పండుగ కోసం తీసుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్గాల్లో వీటిని తిప్పనుంది. ఇప్పటికే పలు స్పెషల్ రైళ్లను ప్రకటించగా.. తాజాగా 22 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్ల షెడ్యూల్ వివరాలను ప్రకటనలో పొందుపర్చింది. అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్(07711) ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5 మధ్య సర్వీసులు అందించనుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరి.. సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్‌కు చేరుకుంటుంది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్-హైదరాబాద్(07712) ప్రత్యేక రైలు సిర్పూర్ కాగజ్ నగర్‌లో సాయంత్రం 6 గంటలకు బయల్దేరి రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైళ్లు చర్లపల్లి, భోంగీర్, యాదాద్రి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దాపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగుతాయి. ఏసీ చైర్ కార్, రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లల్లో ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో జర్నీని ప్లాన్ చేసుకునేవారు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా  బుకింగ్ చేసుకోవచ్చు.

ఇక చర్లపల్లి-నిజాముద్దీన్(07021) రైల్లో నవంబర్ 16న 42, 23వ తేదీన 581, నవంబర్ 30న 658 బెర్త్‌లు ఖాళీగా ఉంటాయి. చర్లపల్లి-నిజాముద్దీన్(07023) రైలులో నవంబర్ 17న 147, నవంబర్ 24న 705 బెర్త్‌లు, నాందేడ్-పానీపట్(07635) నవంబర్ 27న 53 బెర్త్‌లు, చర్లపల్లి-ప్రయోగరాజ్(04122) నవంబర్ 24న 285, డిసెంబర్ 1న 369, చర్లపల్లి-ప్రయోగరాజ్(07077) ట్రైన్‌లో అక్టోబర్ 27న 121 బర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us