Credit Card: క్రెడిట్ కార్డుతో దీపావళి షాపింగ్ చేస్తున్నారా..? ఈ 4 జాగ్రత్తలతో మీరు సేఫ్..

Updated on: Nov 05, 2026 | 1:21 PM

దీపావళి పండక్కి షాపింగ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈఎంఐ రూపంలో లేదా పర్సనల్ లోన్ తీసుకుని వస్తువులు కొంటుంటే జాగ్రత్తగా వ్యహరించాలి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మీపై ఆర్ధిక భారం మరింత పెరగవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
దేశంలోని ప్రజలందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. ఈ పండక్కి చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు.  ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులతో పాటు మొబైల్స్, దుస్తులు లాంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే పండుగ సందర్భంగా వివిధ సంస్థలు ఈఎంఐ ఆఫర్లను అందిస్తుంటాయి. వీటి మాయలో పడి చాలామంది ఎక్కువ ఖర్చు చేయడం, అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈఎంఐలు కట్టలేక తర్వాత ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
క్రెడిట్ కార్డుల ఈఎంఐలు, బై నవ్.. పే లేటర్ లాంటి ఆఫర్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ లైన్లు వంటి మార్గాల ద్వారా మీరు పండక్కి షాపింగ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీరు ఈఎంఐగా మార్చుకోవడం వల్ల మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావితం చూపుతుంది. దీని వల్ల అప్పులు పెరిగిపోవడం వల్ల కుటుంబ బడ్జెట్‌పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఖర్చు పెట్టేముందు ఆర్ధిక బాధ్యతలను గుర్తు చేసుకోవడం మంచిది.

3 / 5
తక్కువ వడ్డీ రేటు ఉంది కదా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయకండి. ప్రాసెసింగ్ ఫీజులు, జప్తు ఛార్జీలు, జీఎస్టీ, తిరిగి చెల్లించే కాలపరిమితులు వంటి వాటిని చెక్ చేయండి. ఈ ఛార్జీలు మీ రుణాలను మరింత పెంచుతాయి. అలాగే ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, నెలవారీ ఖర్చులను లెక్క వేసుకోండి. ఫోన్, ఇతర అవసరాల కోసం మీరు చేసే ఖర్చులన్నీ కలిపితే పెద్దగా అనిపించవచ్చు.

4 / 5
యుటిలిటీ బిల్లులు, బీమా ప్రీమియంలు, ప్రస్తుత అప్పులు వంటి వాటిని పరిగణలోకి తీసుకోండి. షాపింగ్ చేసేటప్పుడు మీకు తక్షణం రుణం అందుతుందంటే.. క్రెడిట్  లభ్యత ఉందని పొరపాటు పడవద్దు. మీరు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. ఏఐ ఆధారిత పేరోల్, ఫ్లాట్ ఫామ్స్ వంటి వాటిల్లో మీరు చెల్లించకలిగే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి.

5 / 5
పండుగ షాపింగ్ ఒక్కరోజులో పూర్తవుతుంది. కానీ ఈఎంఐ చెల్లింపులు కొన్ని నెలలపాటు కొనసాగుతాయి. తాత్కాలిక ఉత్సాహం కోసం దీర్ఘకాలిక ఆర్ధిక ప్రాధాన్యతలకు భగం కలగకుండా చూసుకోండి. మీ పెట్టుబడులు, అత్యవరస నిధి హరించకుండా జాగ్రత్త పడండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టపోకుండా ఉంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us