Diwali Shopping: ఈ దీపావళికి ఆన్‌లైన్‌లో భారతీయులు ఎక్కువగా కొన్నది ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ఈ దీపావళి షాపింగ్ ట్రెండ్స్ చూస్తుంటే భారతీయుల కొనుగోలు అలవాట్లు వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకప్పుడు కిరాణా సరుకులు, స్వీట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పూలు, పూజా సామగ్రి, దుస్తులు, బంగారం, వెండి నాణేలను కూడా క్విక్ కామర్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. దీంతో కేవలం నిత్యావసర వస్తువులకే పరిమితమైన ఈ ప్లాట్‌ఫామ్స్ పండుగ షాపింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Diwali Shopping: ఈ దీపావళికి ఆన్‌లైన్‌లో భారతీయులు ఎక్కువగా కొన్నది ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలు!
Diwali Shopping

Updated on: Nov 10, 2026 | 10:26 AM

Diwali Online Shopping: పండుగలు వచ్చాయంటే భారతీయుల షాపింగ్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా దీపావళి సమయంలో స్వీట్లు, పూలు, పూజా సామగ్రి, కొత్త బట్టలు, బహుమతులు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని కొనాలంటే మార్కెట్లకు, షాపులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్విక్ కామర్స్ (Quick Commerce) ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావడంతో ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల నుంచి బంగారు నాణేల వరకు డెలివరీ అవుతున్నాయి.

ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారతీయులు ఆన్‌లైన్‌లో ఏయే వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేశారు? ఏ స్వీట్లకు ఎక్కువ డిమాండ్ వచ్చింది? బంగారం, వెండి నాణేల కొనుగోళ్లు ఎలా సాగాయి? అనే ఆసక్తికర విషయాలను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), జెప్టో (Zepto) వెల్లడించిన వివరాలు తెలియజేస్తున్నాయి.

దీపావళి షాపింగ్‌లో భారీగా పెరిగిన ఆర్డర్లు:

ఈ దీపావళికి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో పండుగ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గిఫ్ట్ హ్యాంపర్లు, స్వీట్లు, స్నాక్స్, పూజా సామగ్రి, పూలు, అలంకరణ వస్తువులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. జెప్టో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత దీపావళితో పోలిస్తే ఈసారి పండుగ గిఫ్ట్ హ్యాంపర్ల ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయి. దీపాల కొనుగోళ్లు కూడా భారీగా నమోదయ్యాయి. పండుగ సమయంలో ఏకంగా 4.68 లక్షల దీపాల ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది. పూలు, పూలమాలల ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 2.5 రెట్లు పెరిగాయి.

స్వీట్లలో కాజు కట్లీకి భారీ డిమాండ్

దీపావళి అంటే స్వీట్లు తప్పనిసరి. ఈసారి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్వీట్లలో కాజు కట్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూలకు ఎక్కువ డిమాండ్ వచ్చింది. మరోవైపు జెప్టోలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్వీట్లలో లడ్డూలు ముందున్నాయి. అయితే మొత్తం అమ్మకాల పరిమాణం పరంగా సోన్ పాప్డీ అగ్రస్థానంలో నిలిచింది.

పార్టీలు, స్నాక్స్ కొనుగోళ్లలోనూ పెరుగుదల

దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం సాధారణం. దీంతో పార్టీ ఏర్పాట్లకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లు కూడా పెరిగాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గత ఏడాదితో పోలిస్తే పార్టీ ప్లానింగ్‌కు సంబంధించిన ఆర్డర్లు 162 శాతం పెరిగాయి. స్నాక్స్, మంచీస్ కొనుగోళ్లు 42 శాతం వృద్ధి చెందాయి. అంతేకాదు.. పండుగకు ముందు డైట్ కోక్ అత్యధికంగా ఆర్డర్ చేసిన నాన్‌గ్రోసరీ వస్తువుగా నిలిచింది. దీపావళి సందర్భంగా దుస్తులు, ఆభరణాలు, హెయిర్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువుల కొనుగోళ్లు కూడా పెరిగాయి.

బంగారం, వెండి నాణేలకు కూడా భారీ డిమాండ్

దీపావళి సందర్భంగా ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం భారతీయుల సంప్రదాయం. ఈసారి ఆన్‌లైన్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ విలువైన లోహాల కొనుగోళ్లు నమోదయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 6న అర్ధరాత్రి 12 గంటల 30 సెకన్లకు హైదరాబాద్ నుంచి తొలి బంగారు నాణెం ఆర్డర్ వచ్చింది. అది పూల డిజైన్‌తో ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణెం కావడం విశేషం. ఆ తర్వాత కేవలం నాలుగు సెకన్ల వ్యవధిలో బెంగళూరు నుంచి తొలి వెండి నాణెం ఆర్డర్ వచ్చింది.

కొనుగోలు చేసిన బంగారు నాణేల్లో దాదాపు మూడింట రెండు వంతులు పూల డిజైన్లలోనే ఉన్నాయి. ఇక వెండి నాణేల కొనుగోళ్లలో 73 శాతం లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలతో కూడిన డిజైన్లకు సంబంధించినవే. సాయంత్రం 6:38 గంటలకు నాణేల కొనుగోళ్లు అత్యధికంగా నమోదయ్యాయి.

అత్యధికంగా రూ.1.11 లక్షల షాపింగ్ చేసిన ముంబై వాసులు

ఈ దీపావళి సందర్భంగా క్విక్ కామర్స్‌లో అత్యధిక విలువైన షాపింగ్ చేసిన నగరంగా ముంబై నిలిచింది. అక్కడ ఒక కస్టమర్ ఏకంగా రూ.1.11 లక్షల విలువైన వస్తువులను ఆర్డర్ చేశారు. ఇందులో లక్ష్మీ-గణేశ్, కమలం డిజైన్లతో కూడిన బంగారు నాణేలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి రూ.52,215 విలువైన మరో భారీ ఆర్డర్ నమోదైంది. ఇందులో 2 గ్రాముల బంగారు నాణెంతో పాటు 100 గ్రాముల వెండి బార్ ఉన్నాయి. బెంగళూరులో రూ.32,298 విలువైన ఆర్డర్ నమోదైంది. ఇందులో 2 గ్రాముల లక్ష్మీదేవి డిజైన్ బంగారు నాణెంతో పాటు ఆలివ్ ఆయిల్ కూడా ఉంది.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు:

నవంబర్ 8న నమోదైన షాపింగ్ డేటా ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటల 18 నిమిషాలకు ఒక నిమిషంలోనే అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో పండుగ షాపింగ్‌కు సంబంధించి రాయ్‌పూర్, మధురై, గువాహటి, త్రిస్సూర్, కొల్లాం నగరాలు కూడా ముందంజలో నిలిచాయి.

ఈ దీపావళి షాపింగ్ ట్రెండ్స్ చూస్తుంటే భారతీయుల కొనుగోలు అలవాట్లు వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకప్పుడు కిరాణా సరుకులు, స్వీట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పూలు, పూజా సామగ్రి, దుస్తులు, బంగారం, వెండి నాణేలను కూడా క్విక్ కామర్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. దీంతో కేవలం నిత్యావసర వస్తువులకే పరిమితమైన ఈ ప్లాట్‌ఫామ్స్ పండుగ షాపింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: House Construction: ఇల్లు కట్టిస్తున్నారా? ఏ పనికి ఎన్ని రోజులు పడుతుంది.. క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? పూర్తి వివరాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us