ఒకప్పుడు కారు అంటే ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే పరిమితమనే ఆలోచనలో ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మధ్య తరగతి వారు కూడా కారు కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బైక్ ధరలోనే కార్లు కూడా లభిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసే సమయంలో ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశం. సదరు కారుకు గతంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్రమాదం జరిగిన కార్లు సెంటిమెంట్‌గానే కాకుండా, కారులోని పార్ట్స్ కూడా దెబ్బతిని ఉంటాయని గుర్తుంచుకోవాలి.
* ఇక మీరు కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన ఏమైనా లోన్ పెండింగ్‌లో ఉంద అన్న విషయాలను సైతం గమనించాలి. కారు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి.
* ఇక కారు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఒక మంచి మెకానిక్‌తో కారును చూపించుకోవాలి. కారులో ఉన్న లోపాలను మెకానిక్స్ అయితే సరిగ్గా గుర్తిస్తారు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే కారును కొనుగోలు చేయాలి. వాహనం నడుస్తున్నప్పుడు ఇంజిన్‌తో సహా, ఇతర భాగాల నుంచి ఏవైనా శబ్దాలు వస్తున్నాయా? లేదా? అనేది చూసుకోవాలి.
* అలాగే కారులో ప్రధానమైన ఇంజిన్, గేర్ బాక్స్, సస్పెన్సన్, బ్రేక్‌లు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. భవిష్యత్తులో వాటికి ఏమైనా ఖర్చు చేయాల్సి ఉంటుందా అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
* మీరు ఒకవేళ స్వల్పకాలిక వ్యవధి కోసం కారును తీసుకుంటే కచ్చితంగా కారు రీసేల్ వస్తుందా లేదా అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీరు అనుకున్న మొత్తానికి కారు రీసేల్ ఉంటేనే ఆ కారును కొనుగోలు చేయాలి.
* ఇక మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారుకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్టీవో ఆఫీస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ, ఇతర ఆర్థిక సంబంధిత పత్రాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే కారు కొనుగోలు చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..