EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ఈపీఎఫ్‌వో అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్త. అన్‌క్లెయిమ్డ్ ఖాతాల్లోని సొమ్మును త్వరలో ప్రభుత్వం రీఫండ్ చేయనుంది. ఈ మేరకు వారి ఖాతాల్లో వీటిని జమ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ సోమవారం వెల్లడించింది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..
Epfo 4

Updated on: Feb 23, 2026 | 8:49 PM

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. అన్‌క్లెయిమ్డ్ సొమ్మును ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేయపోయినా ఆ అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇన్ ఆపరేటివ్ అకౌంట్‌గా పరిగణిస్తుంది. ఇలాంటి అకౌంట్లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. చాలామంది నిధులను క్లెయిమ్ చేసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం వాటిని క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

31 లక్షల మందికి లబ్ది

కేంద్ర కార్మికశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏకంగా 31 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. తొలి విడతలో పైలట్ ప్రాజెక్ట్‌గా రూ.వెయ్యిలోపు నగదు నిల్వ ఉన్న ఖాతాదారులను బదిలీ చేయనుంది. ఆ తర్వాత ఆపైన సొమ్ము ఉన్న వారికి రీఫండ్ అందించనుంది. రూ.వెయ్యిలోపు నిల్వ ఉన్న ఖాతాలు దాదాపు 7.11 లక్షలు ఉన్నాయి. వీరికి తొలి దశలో అందించనున్నారు. వీరి నిల్వలు రూ.30.52 కోట్లు ఉన్నాయి. వీటిని తొలుత సెటిల్ చేయనున్నారు. ఇక 20 ఏళ్లకుపైబడి నిర్వహణ లేని ఖాతాలు కూడా వీటిల్లో ఉన్నాయి. వీరికి కూడా రీఫండ్ చేయనున్నారు దాదాపు 31.86 లక్షల పీఎఫ్ ఖాతాలు ఇనాక్టివ్‌గా ఉండగా.. వీటిల్లో రూ.10,903 కోట్ల సొమ్ము అలాగే ఉంది. వీటిని విడతల వారీగా ఖాతాదారులకు అందించనుంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ వెల్లడించింది.

ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు

మాములుగా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలంటే డాక్యుమెంట్, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇనాక్టివ్ అకౌంట్లకు అవేమీ అవసరం లేకుండా కేంద్రం రీఫండ్ ఇవ్వనుంది. ఇందుకోసం పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇలాంటి వారికి ఆటోమేటిక్‌గా డబ్బులు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయ ప్రకటించారు. సోమవారం ఈపీఎఫ్ఓ వీక్లీ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్‌క్లెయిమ్డ్ ఖాతాల్లోని సొమ్మును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఇటీవల పీఎఫ్ నిబంధనలు కేంద్రం సరళతరం చేస్తోంది. సులువుగా క్లెయిమ్ పొందేలా కొత్త విధానాలను తీసుకొస్తోంది. ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునే సదుపాయం అమల్లోకి తెస్తోంది. ఆ తర్వాత ఏటీఏం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఉపసంహరించుకునే ఆప్షన్ తీసుకురానుంది. ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌లో భాగంగా వీటిని అమలు చేస్తోంది.

Follow Us