Savings Account: సేవింగ్స్ అకౌంట్ లో ఎక్కువ డబ్బు ఉండొచ్చా?.. ఈ జాగ్రత్తలు పాటించండి..

|

Apr 13, 2022 | 6:40 AM

Savings Account: చాలా మంది ఎక్కువ మెుత్తంలో డబ్బును సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుతూ ఉంటారు. దీని వల్ల రాబడి విషయంలో చాలా నష్టం ఉందని గ్రహించరు. అసలు సేవింగ్స్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంచవచ్చా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Savings Account: రిటైర్డ్ ఆర్మీ మెన్ గోపాల్ భార్య ఆరోగ్యం బాగోలేదు. ఎమర్జెన్సీ ఫండ్‌గా(Emergency fund) గోపాల్ ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు పొదుపు చేసి ఉంటారు. ఈ డిపాజిట్(Deposit) మెుత్తంపై అతను ఏడాదికి 2.7 శాతం వడ్డీని రాబడిగా పొందుతున్నారు. సేవింగ్స్ అకౌంట్లకు ఇతర బ్యాంకులు అధిక వడ్డీ చెల్లిస్తున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఇప్పుడు గోపాల్ ఏమి చేయాలి. ఫిబ్రవరి 25, 2022తో ముగిసిన వారంలో దేశంలోని అన్ని బ్యాంకుల్లోని మొత్తం డిపాజిట్ల విలువ 162.2 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. RBI డేటా ప్రకారం.. బ్యాంకులు కాసా రేషియో 43.7 శాతంగా ఉంది. కాసా అంటే బ్యాంకుల సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డిపాజిట్ చేయబడిన నగదు అని అర్థం. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లను నిర్ణయించే స్వేచ్ఛ బ్యాంకులు కలిగి ఉంటాయి. ఎక్కువ రాబడితో పాటు రక్షణ ఎలా కలిగి ఉండాలనే విషయాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

EV’s Firing: అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కారణాలు కనుక్కునే బాధ్యతను ఆ IITకి అప్పగింత..

Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..