Anand Mahindra: ఒలింపిక్స్ కి వెళితే అతనికి మెడల్ పక్కా.. టాలెంట్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్..

|

Mar 31, 2022 | 6:36 AM

Anand Mahindra: ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలను పంచుకుంటూనే  ఉంటారు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అందులో చాలావరకు మోటివేషన్(Motivation) కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి.

Anand Mahindra: ఒలింపిక్స్ కి వెళితే అతనికి మెడల్ పక్కా.. టాలెంట్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్..
Anand Mahindra
Follow us on

Anand Mahindra: ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలను పంచుకుంటూనే  ఉంటారు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అందులో చాలావరకు మోటివేషన్(Motivation) కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. టీమ్ వర్క్ తో ఉండే లాభాలు, హార్డ్ వర్క్ వల్ల కలిగే వ్యక్తిగత ప్రయోజనాల గురించి చెబుతుంటారు. తాజాగా అలాంటి ఒక మోటివేషనల్ వీడియోను మళ్లీ మహీంద్రా షేర్ చేశారు. మన దేశంలో ఒలింపిక్స్ వరకు వెళ్లిన ఆటగాళ్లు మాత్రమే కాకుండా ట్రైనింగ్ కూడా లేకుండా మిగిలిపోయిన వారు కూడా ఉన్నారంటూ తాజాగా నెట్టింట్లో(Social media) వైరల్ అయిన ఒక వీడియోను తన ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేశారు. సరైన ప్రోత్సాహం అందక, ట్రైనింగ్‌కు అవకాశం లేక చాలామంది టాలెంట్ బయటకు తెలియటం లేదని ఆయన అన్నారు. ఈ వీడియోలో ఓ ధోబీ సైకిల్ తొక్కిన తీరు చూపరులను ఔరా అంటూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వీడియోపై స్పందిస్తూ.. ఈ వ్యక్తి మానవ సెగ్వే, అతని శరీరంలో గైరోస్కోప్ నిర్మించబడింది. అతడి బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారు మన దేశంలో ఎంతోమంది ఉన్నా.. వారికి క్రీడాకారులు అయ్యే టాలెంట్ ఉన్నా.. వారికి ట్రైనింగ్, గుర్తింపు అందట్లేదు అన్న విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది అంటూ ఆ ధోబీ వీడియో షేర్ చేశారు. టాలెంట్ ఉన్న ఇలాంటి వారికి అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారు.. స్పోర్ట్స్ లో రాణిస్తారని అన్నారు. దేశానికి పతకాలు కూడా అందిస్తారని మహీంద్రా అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

Multibagger Returns: నమ్మకంతో నిలిచిన ఇన్వెస్టర్లకు.. హైదరాబాదీ కంపెనీతో లాభాల సిరులు.. వివరాలివే!

LIC Plans: మహిళల కోసంఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. నెలకు 900 పొదుపు చేస్తే రూ. 4 లక్షలు పొందవచ్చు..!