Business Idea: ఈ వ్యాపారంలో మీరు ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు.. మీకు కావల్సిందల్లా..

|

Nov 22, 2022 | 4:07 PM

మీరు సొంతంగా వ్యాపారం చెయ్యాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు ఓ చక్కటి అవకాశం వచ్చింది. మీ ఊరిలో..మీ ఇంట్లోనే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు.. అతి తక్కువ పెట్టుబడితో ప్రతి నెల రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు.

Business Idea: ఈ వ్యాపారంలో మీరు ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు.. మీకు కావల్సిందల్లా..
Snacks
Follow us on

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగానికి బదులు వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివారు కొత్తగా ఆలోచిస్తున్నారు. మీరు వ్యాపార ఆలోచనను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే.. మీకు ఏ వ్యాపారం చేయాలో అర్థం కాకపోతే. ఈ వార్త నుంచి కొత్త ఆలోచన దొరుకుతుంది. కొందరు చైన్ టీ పాయింట్స్ మొదలు పెడుతుంటే.. మరికొందరు హోటల్ బిజినెస్‌పై ఫోకస్ పెడుతున్నారు. తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తంలో ఆర్జించాలని ఆలోచిస్తున్నవారికి ఇలాంటి బిజినెస్‌ మంచిదే అని బిజినెస్ విశ్లేషకులు అంటున్నారు. మన చుట్టూ ఉండేవారిలో మంచి భోజన ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆలోచన చేయవచ్చు. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటే మంచి సంపాధన ఉండటమే కాదు మనతోపాటు నలుగురికి ఉపాధి కూడా లభిస్తుంది.దీనిలో మీరు ప్రతి నెలా కనీసం రూ. 2 లక్షలు సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి ఇంట్లో అవసరం..

నామ్‌కీన్, స్నాక్స్, హోం ఫుడ్స్.. మన దేశంలో టీ తర్వాత రెండవ బిజినెస్ ఇదే అని చెప్పవచ్చు. ఇది అన్ని తరగతుల వారికి ఇష్టం. ఇది మీ ఇంటి వంటగదిలో ముఖ్యమైన అంశం. నమ్కీన్, ఖారా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు భారీ లాభాలను పొందవచ్చు. మీరు దీన్ని చిన్న లేదా పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు. మీరు మీ ఖర్చుకు అనుగుణంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

అవసరమైనవి..

దేశంలోని ప్రతి ఇంట్లో ఉదయం అల్పాహారం నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు నమ్కీన్, ఖరా ఇలాంటివి తినేందుకు మనం చాలా ఇష్టపడుతాం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలం అవసరం. దీని కోసం, మీరు మీ ఇంటిలోని ఏదైనా భాగాన్ని కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు, మీరు FSSAI రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది.

బిజినెస్ మొదలు పెట్టేందుకు..

ఇందు కోసం ఓ ప్యాకింగ్ మెషీన్, ముడిసరుకులు ఉంటే చాలు వెంటనే వ్యాపారం ప్రారంభించవచ్చు. ముడి పదార్థాలలో మీకు నూనె, పప్పులు, బంగాళదుంపలు, శనగపిండి, వేరుశెనగ, కొన్ని మసాలాలు(ధనియా పొడి) అవసరం. దీన్ని ఉపయోగించి మీరు మంచి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత బిజినెస్ పెరిగిన కొద్ది కొన్ని ఆధునిక యంత్రాలను తెచ్చుకుంటే సరిపోతుంది.

ఎంత వరకు సంపాదించవచ్చంటే..

ఈ వ్యాపారంలో మీ ఖర్చు కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు రావచ్చు. ఈ వ్యాపారంలో మీరు ప్రారంభంలోనే 20 నుండి 30 శాతం లాభం పొందుతారు. మీరు రూ. 8 లక్షల వరకు ఖర్చు చేస్తే.. మీకు ఖచ్చితంగా 30 శాతం లాభం వస్తుంది. అంటే మీరు నెలలో రూ. 2 లక్షల 40 వేల రూపాయలు సంపాదిస్తారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం