BSNL: పెరిగిన రీఛార్జ్‌ ధరలతో భయపడుతున్నారా.? అదిరిపోయే ప్లాన్‌..

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికం కంపెనీలు ఏకంగా 26 శాతం వరకు...

BSNL: పెరిగిన రీఛార్జ్‌ ధరలతో భయపడుతున్నారా.? అదిరిపోయే ప్లాన్‌..
Bsnl
Follow us

|

Updated on: Jul 01, 2024 | 5:18 PM

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికం కంపెనీలు ఏకంగా 26 శాతం వరకు ధరలను పెంచేసింది. అయితే ఇదే సమయంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.

తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్‌తో కూడిన ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్తగా రూ. 249 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్‌ పొందొచ్చు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

ఇదిలా ఉంటే ఇదే రీఛార్జ్‌ ప్లాన్‌ ఎయిర్‌టెల్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఎయిర్‌టెల్‌తో పోల్చితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో మరో 17 రోజులు అదనంగా లభిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇతర టెలికం కంపెనీలు భారీగా ధరలను పెంచిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ యూజర్లను ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌లో ఉన్న యూజర్లను కాపాడుతూనే కొత్త వారికి అట్రాక్ట్‌ చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..