29 June 2024
TV9 Telugu
దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని దాటేసింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2005లో తొలుత భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘స్విఫ్ట్ (Swift)’.. 30 లక్షల కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది.
ఇటీవలే మారుతి సుజుకీ తన స్విఫ్ట్ (Swift) నాలుగో జనరేషన్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది.
అంతే కాదు ఈ మారుతి సుజుకీ కారు అద్భుతమైన ఫీచర్స్ కలిగి కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తోంది.
భారత్ మార్కెట్లోకి వచ్చిన 8 ఏళ్లకు 2013 నవంబర్‌లో తొలి పది లక్షల మైలురాయిని దాటింది. మరో ఐదేండ్లకు అంటే 2018లో 20 లక్షల మార్కుకు చేరుకుంది.
సుజుకి హయబుసా (Suzuki Hayabusa) ఐకానిక్ (Iconic) మోటారు సైకిల్ స్ఫూర్తిగా 2005లో రూపుదిద్దుకున్నదే ఈ స్విఫ్ట్ (Swift) కారు.
క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
భారత్ లో అత్యధిక మార్కెట్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలకు పైగా అమ్ముడైన స్పోర్టీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్.