
ప్రైవేట్ టెలికాం కంపెనీలు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను, ఉత్తమ నెట్‌వర్క్‌ను అందిస్తున్నందున మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి భారీ నష్టాలను చవిచూసిన బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూసివేస్తారని కూడా పుకార్లు వచ్చాయి. గ్రామాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరించిన బిఎస్‌ఎన్‌ఎల్.. ఇటీవల టవర్ కింద నిలబడినా ప్రజలు నెట్‌వర్క్ కవరేజ్ పొందలేని పరిస్థితిని ఉండేది. దీని వలన వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు తిరిగి పుంజుకున్న బిఎస్ఎన్ఎల్, కొత్త మార్గంలో కస్టమర్లను చేరుకోవడం ద్వారా, తన నెట్‌వర్క్‌ను మళ్ళీ విస్తరించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతోంది. అలాగే 17 సంవత్సరాల తర్వాత ఈ త్రైమాసికంలో రూ. 262 కోట్లు లాభాలను గడించింది.
నెట్‌వర్క్ విస్తరణ, ఖర్చు ఆప్టిమైజేషన్, కస్టమర్-కేంద్రీకృత సేవా మెరుగుదలలపై దృష్టి సారించిన ప్రయత్నాలే ఈ విజయానికి కారణమని బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. 17 సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ రూ.262 కోట్లు లాభాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఇన్నేళ్ల తర్వాత లాభాలను ఆర్జించడం ఒక మలుపుగా అభివర్ణించారు. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు 14-18% పెరిగాయి. ఇప్పుడు BSNL 4G సేవలను కూడా ప్రారంభించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ సానుకూల వృద్ధిలో ఒక మైలురాయిని జరుపుకుంటుంది. మూడవ త్రైమాసికంలో తాము రూ,262 కోట్లలాభాన్ని సాధించాము. ఇది 2007 తర్వాత లాభాలను సాధించామని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నప్పుడు మీ నిరంతర నమ్మకం, మద్దతుకు ధన్యవాదాలు! అంటూ వినియోగదారులనుద్దేశించి ట్వీట్ చేసింది.
బిఎస్ఎన్ఎల్ కథ ముగిసిపోయిందని ఎందరో అన్నారని, ఈ కంపెనీ నిరంతరం నష్టాలను చవిచూసింది. అది కూడా, 1-2 సంవత్సరాలు కాదు, BSNL 2007 నుండి నష్టాల్లో నడుస్తోంది. దీనిని ప్రైవేటీకరిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
BSNL registers a quarterly profit of close to Rs 262 crores for the FIRST TIME in 17 years. pic.twitter.com/szN8NqmBpE
— DoT India (@DoT_India) February 14, 2025
కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి కంపెనీ విడుదల చేసిన గణాంకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాదాపు 17 సంవత్సరాల తర్వాత లాభాలను నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర లాభం ఆర్జించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి