Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం బిగ్ అలర్ట్.. ఆ యాప్ సేవలు బంద్.. నేటి నుంచే..

కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆన్‌లైన్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు సేవలు అందించిన ఎంఆధార్ యాప్‌ను తొలగించింది. జూన్ 30వ తేదీ నుంచి యాప్ సేవలను నిలిపివేయనున్నల్లు యూఐడీఏఐ ఎక్స్ ఖాతాలో తెలిపింది. దీని స్థానంలో కొత్త యాప్ వాడాలని సూచించింది.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం బిగ్ అలర్ట్.. ఆ యాప్ సేవలు బంద్.. నేటి నుంచే..
Aadhaar Card

Updated on: Jun 30, 2026 | 6:50 AM

ఆధార్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆన్‌లైన్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు ఎంఆధార్ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తున్నారు. అయితే ఈ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. జూన్ 30వ తేదీ నుంచి ఎంఆధార్ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన జారీ చేసింది. నేటి నుంచి ఈ యాప్ ఇక పనిచేయదు. జూన్ 30వ తేదీ నుండి ఎంఆధార్ యాప్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ ఫోన్‌లో యాప్ ఉంటే డిలీట్ చేయాలని సూచించింది. దానికి బదులుగా ఇకపై కొత్త ఆధార్ యాప్‌ను ఉపయోగించాలని సూచించింది. వీలైనంత త్వరగా కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది.

కొత్త యాప్‌లో ఫీచర్లు ఇవే..

ఈ ఏడాది జనవరిలో యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ఉంటే అవసరమైన చోట మీరు ఆధార్ కార్డు ఫోటోకాపీని అందించాల్సిన అవసరం ఉండదు. యాప్‌లోని క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ధృవీకరణ పూర్తి చేయవచ్చు. అలాగే ఈ కొత్త యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్ ఆప్షన్ కూడా ఉంది. ఫేషియల్ అధెంటిఫికేషన్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయవచ్చు. దీని వల్ల మీ వివరాలకు పూర్తి భద్రత ఉంటుంది. అలాగే యాప్‌లోనే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్‌ను ఆన్ లేదా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఆధార్ సంబంధిత మోసాల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త యాప్‌ను రూపొందించినట్లు UIDAI చెబుతోంది. మీ పేరు, వయస్సు మాత్రమే అవసరమైతే మీరు మీ పూర్తి ఆధార్ నంబర్ లేదా ఇతర సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోవచ్చు. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటివి సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.

కొత్త ఆధార్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

– గూగుల్ ప్లే స్టోర్‌ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లో ‘ఆధార్ యాప్’ అని సెర్చ్ చేయాలి
– యాప్ పేరు, యూఐడీఏఐ లోగోతో పాటు, యాప్ పేరులోని పబ్లిషర్స్ లేదా డెవలపర్స్ విభాగంలో తప్పనిసరిగా UIDAI అని ఉండాలి.
-యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి
– ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ తర్వాత మీ ఖాతా సిద్ధంగా ఉంటుంది
-అనంతరం మీకు అవసరమైన సేవలు పొందవచ్చు

 

Loading...
Unable to load recommendations.
Follow Us