Mobile Calls: మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి!

Mobile Calls: ఇక నుంచి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త! తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల, వాయిస్ అథెంటికేషన్ (వాయిస్ బయోమెట్రిక్) ఫీచర్‌ను ఉపయోగించి సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు..

Mobile Calls: మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి!
Mobile Calls

Updated on: Jan 15, 2026 | 5:14 PM

Mobile Calls: తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో జాగ్రత్త. వాయిస్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను స్కామర్‌లు దుర్వినియోగం చేస్తూ మీ ఖాతాల నుండి డబ్బును లాగేసుకుంటున్నారు. అకౌంట్లు సృష్టించడం, లోన్లు తీసుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. ఇటువంటి సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అపరిచిత కాల్స్‌కు దూరంగా ఉండాలి. బ్యాంక్ సెక్యూరిటీ ఫీచర్‌లను సరిచూసుకోవాలి. టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.

ఇక నుంచి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త! తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల, వాయిస్ అథెంటికేషన్ (వాయిస్ బయోమెట్రిక్) ఫీచర్‌ను ఉపయోగించి సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫోన్ సంభాషణల ద్వారా వారి వాయిస్‌ను రికార్డ్ చేసి, బ్యాంక్ లావాదేవీలు చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల ఖాతాల నుండి డబ్బును లాగేసుకోవడమే కాకుండా, వారి వాయిస్‌ను ఉపయోగించి నకిలీ ఖాతాలను సృష్టించడం, లోన్లు తీసుకోవడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Friday Bank Holiday: జనవరి 16న బ్యాంకులకు సెలవు ఉంటుందా..?

ఇవి కూడా చదవండి

ఇటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి:

1. అపరిచిత కాల్స్‌ను స్వీకరించవద్దు: తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌ను అస్సలు లిఫ్ట్ చేయకుండా ఉండటం ఉత్తమం. వాటిని నేరుగా వాయిస్ మెయిల్‌కు వెళ్లనివ్వండి.

2. వాయిస్ ఫ్రేజ్‌లను సరిచూసుకోండి: మీ బ్యాంకుకు కాల్ చేసి, వాయిస్ అథెంటికేషన్ కోసం నిర్దిష్ట “వాయిస్ ఫ్రేజ్‌లు” లేదా పాస్‌వర్డ్ లాంటి పదాలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. ఇవి ట్రాన్సాక్షన్ చేయడానికి తప్పనిసరి అయితే, వాటి భద్రతను నిర్ధారించుకోండి.

3. టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేయండి: వాయిస్ అథెంటికేషన్ ఉన్నప్పటికీ, మీ బ్యాంకు టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ (2FA) సౌకర్యాన్ని అందిస్తే, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇది మీ ఖాతాకు అదనపు భద్రతను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: UPI Payments: ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?

ఎక్కువ శాతం సైబర్ మోసాలు అపరిచిత కాల్‌, మెసేజ్‌ల నుండే జరుగుతున్నందున, వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

ఇది కూడా చదవండి: Employees: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే..! ఈ పని తప్పక చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి