Business Idea: ఎవర్‌ గ్రీన్ బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం..

|

Jan 15, 2024 | 7:47 PM

అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపార మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఉన్న ఊర్లోనే, అదికూడా ఇంటిలోనే చేసుకునే వ్యాపారాల్లో మినీ ఆయిల్ మిల్‌ బిజినెస్ ఒకటి. ఇటీవల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది...

Business Idea: ఎవర్‌ గ్రీన్ బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం..
Business Idea
Follow us on

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం వైపు అడుగులు వేస్తుంటారు. అయితే బిజినెస్‌ అనగానే ఎవరైన వెనుకడుగు వేసేది పెట్టుబడి విషయంలోనే. పెట్టబడి ఎక్కువనే భయంతోనే వ్యాపారం ఆలోచనను మానుకుంటారు.

అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపార మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఉన్న ఊర్లోనే, అదికూడా ఇంటిలోనే చేసుకునే వ్యాపారాల్లో మినీ ఆయిల్ మిల్‌ బిజినెస్ ఒకటి. ఇటీవల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మంచి నాణ్యతగల నూనె తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇలా నేచురల్‌గా తయారు చేసే ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతోంది.

దీనిని మంచి బిజినెస్‌ ఆలోచనగా మార్చుకుంటే భారీ లాభాలు ఆర్జించవచ్చు. ఒకప్పుడు విత్తనాల నుంచి నూనెను తీయడానికి పెద్ద పెద్ద మిషీన్లు అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చిన్న మిషీన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో చిన్న గదిలోనే మినీ ఆయిల్‌ మిల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా.. ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషీన్ కావాలి. చిన్న గదిలో ఈ మెషీన్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆవాలు, పల్లీలు, నువ్వుల నూనెను ఈ మెషీన్ల ద్వారా తీయొచ్చు. మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషీన్‌కు రూ.2 లక్షల వరకు అవసరపడుతుంది. అలాగే రా మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రూ.2 లక్షలు అవసరం ఉంటుంది. దీంతో ఈ వ్యాపారాన్ని రూ. 4 లక్షల పెట్టుబడి సరిపోతుంది.

ఆవాలు, పల్లీలు, ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించి నూనెను తీయొచ్చు. రైతుల దగ్గర కొనుగోలు చేస్తే.. మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడిసరుకు లభిస్తుంది. పల్లీ నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనెకు నిత్యం డిమాండ్ ఉంటుంది. లైసెన్స్ తీసుకొని ప్యాకేజింగ్ చేస్తే ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దుకాణాలు సప్లై చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..