OPPO Fast Charing: బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో Oppo తన SuperVooc ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలోని అధునాతన వెర్షన్‌ను ప్రదర్శించింది. గతంలో ఉన్న సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ రికార్డును బద్దలు కొట్టేందుకు సూపర్‌వూక్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు కంపెనీ గతవారం విడుదల చేసిన OPPO Find X5 మోడల్ ఫోన్ తో 150W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్‌ను కూడా మార్కెట్ లోకి తెచ్చింది. కంపెనీ దీనిని మైుబైల్ పరిశ్రమలో సాంకేతిక పురోగతిగా చెబుతోంది. కొత్త 240W సూపర్ ఊక్ ఛార్జర్ వినియోగించి 4,500mAh బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఒకటి నుంచి 100 శాతం పూర్తి ఛార్జింగ్ పూర్తవుతుందని వెల్లడించింది. దీనికి తోడు 150W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ అదే బ్యాటరీని ఐదు నిమిషాల్లో 50 శాతం.. కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేస్తున్నట్లు ఒప్పో సంస్థ పేర్కొంది.
నూతనంగా అభివృద్ధి చేసిన ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి సారిస్తూ.. కొత్త 240W సూపర్‌వూక్ టైప్-సి ఇంటర్‌ఫేస్‌లో 24V/10A టెక్నాలజీతో రూపొందించబడిందని ఒప్పో వెల్లడించింది. ఇది మూడు ఛార్జ్ పంపుల ద్వారా శక్తిని పొందుతుందని, హ్యాండ్‌సెట్‌లకు సరఫరా చేయబడిన శక్తిని 10V/24Aకి మార్చగలదని స్పష్టం చేసింది. ఒప్పో తీసుకొస్తున్న ఈ సాంకేతికత ఇప్పటికే ఉన్న పరికర నిర్దేశాలకు అనుగుణంగా ఉండగా.. భద్రత, హీట్ విడుదలకు సంబంధించిన పరీక్షలు కూడా పూర్తయ్యాయి. భద్రత కోసం, ఇది యూనిట్ యొక్క వోల్టేజ్, కరెంట్ మరియు ఉష్ణోగ్రతను నియంత్రించే చిప్‌ను అమర్చారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ ఉపయోగంలో ఉన్నప్పుడు బయటి కారణాల వల్ల పాడవుతుందా అనే అంశాన్ని బ్యాటరీ సేఫ్టీ మానిటరింగ్ చిప్ తనిఖీ చేయటం దీనిలోని మరో ప్రత్యేకత. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఓవర్ హీట్ అయ్యే అవకాశాలను తగ్గించడానికి, Oppo 13 ఉష్ణోగ్రత సెన్సార్‌లతో అనుకూలమైన ఫోన్‌లను సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇవీ చదవండి..
Viral Video: తాజ్ మహల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం.. నెట్టింట్లో వీడియో వైరల్..