April Bank Holiday: ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

|

Mar 29, 2024 | 2:35 PM

మార్చి నెల, ఆర్థిక సంవత్సరం 2023 ముగియడానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌లో, రామ నవమి, ఈద్ వంటి అనేక పండుగల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్‌కు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. జాబితా ప్రకారం, ఏప్రిల్‌లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి..

April Bank Holiday: ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
April Bank Holiday
Follow us on

మార్చి నెల, ఆర్థిక సంవత్సరం 2023 ముగియడానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌లో, రామ నవమి, ఈద్ వంటి అనేక పండుగల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్‌కు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. జాబితా ప్రకారం, ఏప్రిల్‌లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుదినం వివిధ రాష్ట్రాల ప్రకారం.. ఇందులో శని, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని సెటిల్ చేసుకోవడానికి బ్యాంక్‌కి వెళ్లబోతున్నట్లయితే మీరు ఒకసారి ఏప్రిల్ 2024కి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేయాలి. మరి ఏప్రిల్‌ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం..

ఏప్రిల్‌లో బ్యాంకులు మూసి ఉండే రోజులు:

  • 1 ఏప్రిల్ 2024: ఆర్థిక సంవత్సరం ముగిసినప్పుడల్లా, బ్యాంక్ మొత్తం ఆర్థిక సంవత్సరం ఖాతాలను పరిశీలిస్తుంటాయి. అగర్తల, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కొహిమా, లక్నో, ముంబయిలో ఏప్రిల్ 1న ఖాతా ముగుస్తుంది. నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • 5 ఏప్రిల్ 2024: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమ్మత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
  • 9 ఏప్రిల్ 2024: గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సరం. అలాగే మొదటి నవరాత్రి సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
  • 10 ఏప్రిల్ 2024: ఈద్ కారణంగా కొచ్చి, కేరళలో మూసి ఉంటాయి.
  • 11 ఏప్రిల్ 2024: ఈద్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే చండీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం బ్యాంకులు తెరిచి ఉంటాయి.
  • 15 ఏప్రిల్ 2024: హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లా బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి.
  • 17 ఏప్రిల్ 2024: రామ నవమి ఏప్రిల్ 17న. రామ నవమి సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • 20 ఏప్రిల్ 2024: గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి.

సాధారణంగా బ్యాంకులు మూసి ఉండే రోజులు

ఇవి కూడా చదవండి

ప్రతి నెలా ఆదివారం, రెండవ శనివారం, నాల్గవ శనివారం బ్యాంకులు మూసే ఉంటాయి. ఏప్రిల్‌లో దేశంలోని అన్ని బ్యాంకులు ఏప్రిల్ 7 (ఆదివారం), 13 ఏప్రిల్ (రెండవ శనివారం), 14 ఏప్రిల్ (ఆదివారం), 21 ఏప్రిల్ (ఆదివారం), ఏప్రిల్ 27 (నాల్గవ శనివారం), 28 ఏప్రిల్ (ఆదివారం) తేదీలలో మూసి ఉంటాయి.

బ్యాంకు మూతపడిన తర్వాత కూడా కస్టమర్లకు సదుపాయం లభిస్తుంది. కస్టమర్లు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ATMని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా సులభంగా చెల్లింపు చేయవచ్చు. ఇందులో ఎలాంటి ఆటంకాలు ఉండవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి