Bank Strike: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా మూడ్రోజులు మూతబడనున్న బ్యాంక్‌లు!.. ఎదుంకంటే?

బ్యాంక్ కస్టమర్లకు ఇదో బిగ్‌ అలర్ట్.. ఎందుకంటే ఈ నెలలో వరుసగా మరో మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె దిగుతారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది.

Bank Strike: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా మూడ్రోజులు మూతబడనున్న బ్యాంక్‌లు!.. ఎదుంకంటే?
Bank Employees Threaten Three Day Strike

Updated on: Sep 15, 2026 | 7:39 AM

దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంక్‌లు మూతబడబోతున్నాయి. వారంలో నాలుగు శనివారాల సెలవుదినాల విషయంలో జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయట్లేదని.. సర్కార్ తమ డిమాండ్లను పరిష్కరించకుండా, ఇలానే డీలే చేస్తే.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయి. వాటిని నాలుగు శనివారాలనూ సెలవు దినాలుగా ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే నాలుగు శనివారాలు సెలవులు ఇవ్వాలంటే పనిదినాల్లో పనివేళలను పెంచాలని ప్రభుత్వం షరతు విధించిందని.. దానికి బ్యాంకు ఉద్యోగులు అంగీకరిస్తూ, రోజూ కస్టమర్ సర్వీస్ సమయాన్ని మరో 40 నిమిషాలు పెంచేందుకు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదని, తమ డిమాండ్‌నూ కూడా పరిష్కరించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్యపై చర్చించేందుకు లేబర్ వెల్ఫేర్ కమిషనర్ సెప్టెంబర్ 22న సమావేశానికి పిలుపునిచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ చర్చల్లో పరిష్కారం లభించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని వెంకటాచలం స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us