Telugu News Business Bank holidays in january: branches to remain closed for 16 days check state wise holiday list
January Bank Holidays: జనవరిలో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..
దస్తుగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా సెలవులను తెలుసుకుంటే బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవులను విడుదల చేస్తుంటుంది. మరి జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి.
కొత్త సంవత్సరం ప్రారంభమైంది. జనవరి నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు రానున్నాయి. దీంతో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు ముందస్తుగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా సెలవులను తెలుసుకుంటే బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవులను విడుదల చేస్తుంటుంది. మరి జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి.
జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
జనవరి 7వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
జనవరి 11వ తేదీ మిషనరీ డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు
ఇక జనవరి 12వ తేదీ శుక్రవారం.. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బంగాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి
జనవరి 13వ తేదీ రెండో శనివారం. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
జనవరి 14వ తేదీ ఆదివారం (సంక్రాంతి) దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
జనవరి 15వ తేదీ సోమవారం రోజున పొంగల్, తిరువళ్లూర్ డే సందర్భంగా ఏపీతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు.
జనవరి 16 వతేదీ మంగళవారం తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోంలో హాలిడే
జనవరి 17వ తేదీన బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
జనవరి 21వ తేదీన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
జనవరి 23వ తేదీ మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు
జనవరి 25వ తేదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
జనవరి 26వ తేదీ శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
జవనరి 27వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జనవరి 28వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఇక జనవరి 31వ తేదీ బుధవారం మిడామ్ మే ఫి సందర్భంగా అసోంలో బ్యాంకులకు సెలవు