Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. 17 రోజుల పాటు బంద్!
Bank Holidays: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే వారు ముందస్తుగా ఏయే రోజు బ్యాంకు మూసి ఉంటుందో తెలుకుని వెళ్లడం ముఖ్యం. బ్యాంకుల సెలవుల జాబితా ప్రకారం ముందస్తు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు నవంబర్ నెల ముగియబోతోంది. ఇప్పుడు డిసెంబర్ ప్రారంభం కానుంది. మరో ఐదు రోజుల్లో ఈ నెల గడిచిపోనుంది. గత నెలలో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి. డిసెంబర్‌లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి. వాస్తవానికి డిసెంబర్‌లో పండుగలు ఉండవు. కానీ చాలా ప్రత్యేక రోజులు ఉన్నాయి. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. ఆర్బీఐ నివేదికల ప్రకారం.. డిసెంబర్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.
డిసెంబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా:
డిసెంబర్ 1న ఆదివారం – (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.