Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులు తప్పనక తెలుసుకోవాల్సిన అసరముంది. లేకపోతే బ్యాంక్ లావాదేవీలు చేసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశముంది. వచ్చే నెలలో పండుగల కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. అలాగే ప్రాంతీయ పండుగలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో మీ ప్రాంతాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులు ఉండవనేది తెలుసుకోవాలి.

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!
Bank Holidays

Updated on: Nov 27, 2026 | 8:15 AM

2026 సంవత్సరంలోని చివరి నెల వచ్చేస్తోంది. అంటే డిసెంబర్ నెల మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. విద్యార్థుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరూ సెలవుల కోసం ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు డిసెంబర్ సెలవుల్లో ప్రయాణాలు చేయడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకునేవారు బ్యాంక్ హాలీడేస్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వచ్చే నెలలో క్రిస్మస్ పెద్ద పండుగ రానుంది. దీంతో పాటు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కలిపి బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవుల కారణంగా మూడపడనున్నాయి. డిసెంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో క్లోజ్ కానున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..

డిసెంబర్ 1, 3, 9, 11, 18, 19, 24, 26, 30, 31 తేదీలలో బ్యాంకులు మూతపడనున్నాయి. మొత్తం 10 బ్యాంకు సెలవులు వచ్చే నెలలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో స్వదేశీ విశ్వాస దినోత్సవం,రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవు. గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన బ్యాంకులు మూసివేయనున్నారు. సిక్కింలో లోసుంగ్/నామ్‌సుంగ్ పండుగ సందర్భంగా డిసెంబర్ 9,11వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో డిసెంబర్ 18న బ్యాంకులకు సెలవు ప్రకటించారు. గోవా విమోచన దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 19న ఆ రాష్ట్రంలో బ్యాంకులు మూతపడనున్నాయి. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లలో డిసెంబర్ 24న బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే డిసెంబర్ 6వ తేదీన ఆదివారం, డిసెంబర్ 12న రెండో శనివారం, డిసెంబర్ 13న ఆదివారం, డిసెంబర్ 20న ఆదివారం, డిసెంబర్ 26న నాలుగో శనివారం, డిసెంబర్ 27న ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

ఏయే సేవలు నిలిచిపోతాయి..

బ్యాంక్ సెలవు రోజుల్లో కేవలం బ్రాంచ్ కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. ఆన్‌లైన్ సేవలు యథావిధంగా అందుబాటులో ఉంటాయి. దీంతో ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా తమ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ విధానంలో ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. కేవలం బ్రాంచ్ సంబంధిత పనులు మాత్రమే సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు.

Loading...
Unable to load recommendations.
Follow Us