Mahindra EV: మహీంద్రా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్ 683.. పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Mahindra EV: మహీంద్రా BE 6 స్పోర్టెక్‌తో BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. BaaSను ఎంచుకోవడం ద్వారా తక్కువ శ్రేణిలోని వన్, టూ వేరియంట్ల ధరలు వరుసగా రూ.11.45 లక్షలు, రూ.12.95 లక్షలకు తగ్గుతాయి. దీనివల్ల నేరుగా రూ.8 లక్షల..

Mahindra EV: మహీంద్రా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్ 683.. పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!
Mahindra Be 6 Sporteq

Updated on: Aug 18, 2026 | 4:44 PM

Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV BE 6 అప్‌డేటెడ్ వెర్షన్‌ను ’SPORTEQ’ పేరుతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త రంగులు, కొత్త 70 kWh బ్యాటరీ ప్యాక్, డిజైన్ అప్‌డేట్స్‌తో ఈ SUV అందుబాటులోకి వచ్చింది. BE 6 స్పోర్టెక్ కొన్ని కొత్త ఫీచర్లు, కొత్త 70kWh బ్యాటరీ ఆప్షన్, మరిన్నింటిని అందిస్తుంది. కంపెనీ తన కస్టమర్ల కోసం ఈ శ్రేణికి అనేక కొత్త ఫీచర్లను జోడించి, దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఫలితంగా, ప్రజలు ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. BE 6 స్పోర్టెక్ లైనప్‌ గురించి వివరంగా తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!

మహీంద్రా BE 6 స్పోర్టెక్ ధర, పవర్‌ట్రెయిన్

BE 6 స్పోర్టెక్ ధర రూ. 19.45 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పాత BE 6 కంటే రూ. 85,000 ఎక్కువ. టాప్ మోడల్ ధర రూ. 26.95 లక్షలు. ఇది ఏడు వేరియంట్లలో లభిస్తుంది. వన్, టూ, త్రీ, త్రీ+, ఫోర్, FE, FE ఫోర్. FE అంటే BE 6 స్పోర్టెక్ ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్, ఇది మరింత స్పోర్టీ లుక్స్‌ను కలిగి ఉంటుంది. లాంచ్ ఎడిషన్ కూడా ఉందిజ ఇది టాప్-స్పెక్ ఫోర్ వేరియంట్ ఆధారంగా ప్రత్యేకమైన బయట, లోపల ఫినిషింగ్‌లతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

BaaS ఇప్పుడు అందుబాటులో..

మహీంద్రా BE 6 స్పోర్టెక్‌తో BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. BaaSను ఎంచుకోవడం ద్వారా తక్కువ శ్రేణిలోని వన్, టూ వేరియంట్ల ధరలు వరుసగా రూ.11.45 లక్షలు, రూ.12.95 లక్షలకు తగ్గుతాయి. దీనివల్ల నేరుగా రూ.8 లక్షల తగ్గింపు లభిస్తుంది. బ్యాటరీ అద్దె ఛార్జ్ కిలోమీటరుకు రూ.3.75గా ఉంది. మిగిలిన వేరియంట్ల కోసం BaaS ధరలను ఇంకా వెల్లడించలేదు.

BE 6 స్పోర్టెక్ మునుపటి 59kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్‌లను కొనసాగిస్తూనే, మహీంద్రా XEV 9Sలో తొలిసారిగా పరిచయం చేసిన కొత్త 70kWh ప్యాక్‌ను కూడా జోడించింది. అన్ని బ్యాటరీలలో వెనుక భాగంలో అమర్చిన (RWD) ఒకే మోటార్ ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్, పెర్ఫార్మెన్స్

మహీంద్రా ఇందులో కొత్తగా 70 kWh బ్యాటరీ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. వేరియంట్‌ను బట్టి పవర్, రేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • 59 kWh బ్యాటరీ: 232 PS పవర్, 380 Nm టార్క్ రేంజ్: 548 కిలోమీటర్లు
  • 70 kWh బ్యాటరీ: 245 PS పవర్, 380 Nm టార్క్ రేంజ్: 651 కిలోమీటర్లు
  • 79 kWh బ్యాటరీ: 286 PS పవర్, 380 Nm టార్క్ రేంజ్: 683 కిలోమీటర్లు
  • ఛార్జింగ్: 79 kWh బ్యాటరీ ప్యాక్ 180 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని సహాయంతో కేవలం 20 నిమిషాల్లో 20% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్, కలర్స్, ఇంటీరియర్ ఎక్స్‌టీరియర్ డిజైన్: కారెక్టరిస్టిక్ కూపే-SUV డిజైన్, C-షేప్డ్ LED DRLలు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది (Formula E ఎడిషన్‌లో 20-ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు).

కొత్త కలర్ ఆప్షన్లు: రూబీ వేల్వెట్ (Ruby Velvet), రోస్సో ఇంపుల్సో (Rosso Impulso), గ్రాఫైట్ స్టార్మ్ (Graphite Storm).

ఇంటీరియర్, ఫీచర్లు

  1. త్రీ-స్క్రీన్ సెటప్: డాష్‌బోర్డ్‌లో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్తగా 12.3-ఇంచ్ ప్యాసింజర్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్‌ప్లే ఇచ్చారు.
  2. క్యాబిన్: ప్రీమియం బ్లాక్, టాన్ (Black & Tan) థీమ్ ఇంటీరియర్.
  3. ఇతర ముఖ్య ఫీచర్లు: Google Gemini ఆధారిత TEQ సూట్, 16-స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు.
  4. బూట్ స్పేస్: 455 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు ముందు భాగంలో 45 లీటర్ల ‘ఫ్రంక్’ (Frunk) స్టోరేజ్ అందుబాటులో ఉంది.

సేఫ్టీ ఫీచర్లు:

  1. మహీంద్రా BE 6 క్రాష్ టెస్టింగ్‌లో Bharat NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.
  2. 7 ఎయిర్‌బ్యాగ్‌లు
  3. లెవెల్ 2+ ADAS (Advanced Driver Assistance Systems)
  4. 540-డిగ్రీ కెమెరా
  5. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), TPMS
  6. ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్

పోటీదారులు:

భారత మార్కెట్లో మహీంద్రా BE 6 SPORTEQ మోడల్ టాటా సియెర్రా EV, టాటా కర్వ్ EV, మారుతి సుజుకి e-విటారా, MG ZS EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లకు పోటీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us