
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. ఉద్యోగం చేసేవారికి ప్లే స్లిప్‌లో మార్పులు, టేక్ హోం శాలరీలో కొత్త నిబంధనలు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం డీఏ, రిటైనింట్ అలవెన్స్‌లో మార్పులు జరగనున్నాయి. వీటి గురించి ప్రతీఒక్క ఉద్యోగి తెలుసుకోవాల్సిందే. మరో మూడు రోజుల్లో రానున్న కొత్త నియమాల గురించి తెలుసుకుందాం.

ఇక నుంచి ప్లే స్లిప్ మారనుంది. ఇక నుంచి మీ శాలరీలో బేసిక్ పే అనేది కనీసం 50 శాతం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటివరకు మొత్తం సీటీసీలో బేసిక్ జీతం 25 శాతం నుంచి 40 శాతం వరకు ఉండేది. కొన్ని కంపెనీలకు డీఏ, రిటైనింగ్ అలవెన్స్ లేకపోవడంతో కంపెనీలు బేసిక్ పే పెంచాల్సి వచ్చేది. అలవెన్సులు 50 శాతం దాటితే పీఎఫ్, గ్రాట్యుటీకి వెళతాయి.

బేసిక్ శాలరీ పెరగడం వల్ల టేక్ హోం శాలరీ అనేది తగ్గుతుంది. పీఎఫ్ అకౌంట్‌కు ఎక్కువ జమ అవుతుంది. దీని వల్ల మీకు దీర్ఘకాలిక సేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక గ్రాట్యూటీ కూడా పెరిగే అవకాశముంది. అలాగే కార్మిక కోడ్‌ల ప్రకారం ఉద్యోగులకు ఉపయోగపడే మరో నిర్ణయం రానుంది. మీరు ఉద్యోగానికి రిజైన్ చేసినప్పుడు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఉద్యోగానికి రాజీమానా సమర్పిస్తే చివరి పది దినం నుంచి 45 రోజుల్లోగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ చేసేవారు. కానీ ఇక నుంచి ఉద్యోగం వదిలేసిన తర్వాత రెండు రోజుల్లోనే ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సిందే. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర పెండింగ్ బకాయిలను రెండు రోజుల్లోనే కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు ఆలస్యం చేస్తే లేబర్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

ఒకవేళ మీకు ఆలస్యంగా చెల్లిస్తే ఉద్యోగి వడ్డీ కూడా పొందవచ్చు. ఇక గ్రాట్యూటీ సొమ్ము 30 రోజుల్లో చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇక కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి నూతన ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లోకి రానుంది. దీని వల్ల ఉద్యోగుల హెచ్‌ఆర్ఏ, మీల్స్ కూపన్స్ అలవెన్సులలో అనేక మార్పులు వస్తున్నాయి.