Apple Electric Car: ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండడం, ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊతమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాయితీలు అందిస్తున్నాయి. దీంతో బడా కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఇక గత కొన్ని రోజులుగా యాపిల్ నుంచి విద్యుత్ ఆధారిత కార్లు రానున్నాయని వార్తలు వస్తున్నాయి. 2024లోపు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోన్న యాపిల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు కోసం ప్రముఖ దిగ్గజ మోటార్ కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారి అల్‌రిచ్ క్రాన్జ్‌ను నియమించుకుంది. క్రాన్జ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ కంపెనీ కానూకు సీఈవోగా పనిచేస్తున్నారు. బీఎండబ్ల్యూ ఆల్ ఎలక్ట్రిక్ ఐ3, హైబ్రిడ్ ఐ 8 స్పోర్ట్ కారును తయారుచేయడంలో క్రాన్జ్ కీలక పాత్ర పోషించాడు. మరి క్రాన్జ్ రాకతో యాపిల్ ఎలక్ట్రిక్ కారు తయారీ ఊపందుకుంటుందో చూడాలి.
Pulsar ns125 : పల్సర్ బైక్ ఇప్పుడు సరికొత్త వేరియెంట్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర కూడా తక్కువే..?
Niharika Konidela: అమ్మ చీరలే అందం.. నయా రూటులో బుట్టబొమ్మలు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!