Honda Bike: బంపర్ ఆఫర్.. రూ. 75 వేల హోండా బైక్‌ను.. కేవలం రూ. 20 వేలకే ఇంటికి తీసుకెళ్లండి!

|

Feb 06, 2023 | 9:33 AM

మీరు హోండా బైక్‌ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కేవలం రూ. 20 వేలకే ఇంటికి తీసుకురావచ్చు. తక్కువ బడ్జెట్‌లో..

Honda Bike: బంపర్ ఆఫర్.. రూ. 75 వేల హోండా బైక్‌ను.. కేవలం రూ. 20 వేలకే ఇంటికి తీసుకెళ్లండి!
Representative Image
Follow us on

మీరు హోండా బైక్‌ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కేవలం రూ. 20 వేలకే ఇంటికి తీసుకురావచ్చు. తక్కువ బడ్జెట్‌లో హోండా సీబీ షైన్(Honda CB Shine)ను సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంచింది. సాధారణంగా ఈ మోడల్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 72,787 నుంచి రూ. 77,582 మధ్య ఉంటుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

ఈ హోండా సీబీ షైన్ బైక్‌ను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ‘Bikes 24’ తక్కువ ధరకు అందుబాటులో పెట్టింది. ఈ 2019 మోడల్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 65 కిలోమీటర్లు అందిస్తుంది. అలాగే 10.5 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ ఈ వాహనంలో ఉంది. అలాగే దీనిది ఎయిర్ కూలెడ్, 4 స్ట్రోక్, బీఎస్-6 ఇంజిన్. ఈ వాహనానికి డిస్క్, డ్రమ్ బ్రేక్స్ అమర్చబడ్డాయి. ఈ బైక్ కేవలం రూ. 20 వేలకే అమ్మకానికి అందుబాటులో ఉంచారు. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంతో ప్రచురించబడింది. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడమైనది.