Aadhaar Card: పాస్‌పోర్టు ఉంటే వారు కూడా ఆధార్‌ కార్డు పొందవచ్చు..!

|

Mar 29, 2022 | 11:15 AM

Aadhaar Card: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఇది లేనిది పనులు జరగవు. ప్రతి దానికి ఆధార్‌ లింక్‌ అనేది తప్పనిసరైంది..

Aadhaar Card: పాస్‌పోర్టు ఉంటే వారు కూడా ఆధార్‌ కార్డు పొందవచ్చు..!
Follow us on

Aadhaar Card: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఇది లేనిది పనులు జరగవు. ప్రతి దానికి ఆధార్‌ లింక్‌ అనేది తప్పనిసరైంది. ప్రతి వివరాలు ఆధార్‌ ద్వారా తెలిసిపోతుంది. అయితే నాన్ రెసిడెంట్ ఇండియన్(NRI)లు ఆధార్ కార్డు తీసుకోవచ్చా..? అనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటుంది. సాధారణ భారతీయ పౌరులు మాదిరిగానే సాధారణ భారతీయ పౌరుల మాదిరిగానే వీరు కూడా ఆధార్ కార్డును పొందవచ్చని కేంద్రం తెలిసింది. ఆగస్టు 2021 వరకు NRIలు ఆధార్ కార్డు పొందాంటే 182 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆ సమయ వ్యవధిని తొలగించింది.

NRIలు ఆధార్‌ ఎలా పొందవచ్చు..

NRIలు ఆధార్‌ కార్డు పొందేందుకు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాలి. ఈ కార్డు కోసం వారి వద్ద తప్పనిసరిగా భారతీయ పాస్‌పోర్టు ఉండాలి. ఆధార్‌ సెంటర్‌లో నింపే దరఖాస్తులు పూర్తి వివరాలు నమోదు చేయాలి. అలాగే దరఖాస్తులు ఇమెయిల్‌ తప్పనిసరిగ్గా ఉండాలి. అయితే భారతీయ పౌరుల దరఖాస్తుతో పోల్చితే ఎన్‌ఆర్‌ఐల దరఖాస్తు కొంత భిన్నంగా ఉంటుంది. పాస్‌పోర్టు ఫోటో కాఫీని ఈ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాలి. పూర్తి వివరాలు నింపిన తర్వాత బయోమెట్రిక్‌ సమాచారాన్ని క్యాప్చర్‌ చేస్తారు. దరఖాస్తులో ఇచ్చిన సమాచారమంతా కంప్యూటర్‌లో నమదు చేస్తారు. తర్వాత మీకు రిజిస్ట్రేషన్‌ స్లిప్‌ ఇస్తారు. దీనిలో 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, తేదీ, సమయం అన్ని రికార్డు అయి ఉంటాయి.

మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరి:

NRIలు ఆధార్‌ పొందాలంటే భారత మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరిగ్గా ఉండాలి. ఆధార్‌ కార్డుకు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ నెంబర్లను అనుమతించరు. అలాగే ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు ఆధార్‌ కావాలంటే వారి భారత పాస్‌పోర్టును సమర్పించాలి.ఒక వేళ పిల్లలకు ఇండియా పాస్‌పోర్టు లేకపోతే తల్లిదండ్రులు తమ సంబంధం తెలుపుతూ డాక్యుమెంట్లను సమర్పించాలి. తల్లిదండ్రుల్లో ఒకరు అప్రూవల్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

LPG Gas: గ్యాస్‌ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం సరికొత్త నిర్ణయం..!

Airbags: కారు ప్రయాణం ఇక మరింత సురక్షితం.. కేంద్రం కీలక ప్రకటన.. కొత్త నియమ, నిబంధనలు.. ఎప్పటి నుంచి అంటే..