TATA ACE PRO: హైదరాబాద్‌లో ACE ప్రో.. మరో మైలురాయిని సాధించిన టాటా మోటర్స్

Updated on: Jul 11, 2025 | 11:56 AM

హైదరాబాద్లో ఏస్ ప్రో ను ప్రారంభించడం గర్వకారణంగా ఉందని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ పినాకి హవల్దార్ అన్నారు. టటా ఏస్ 20 ఏళ్ల ప్రయాణం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్న వ్యాపారులకు భద్రత, ఆర్థికసాయం అందించేందుకు టాటా ఏస్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.

స్మాల్ కమర్షియల్ వెహికిల్స్ మొబిలిటీలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ACE ప్రోను ప్రారంభించడం ద్వారా మరో మైలురాయిని సాధించింది.  సరికొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో.. ఏస్ ప్రో ప్రారంభించడం పట్ల టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ పినాకి హవల్దార్  కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన టాటా ఏస్‌ ఒక బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ రంగంలో టాటా మోటార్స్ ఒక దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. సుమారు 25 లక్షల కుటుంబాలు తమ వాహనాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మా ఉత్పత్తి శ్రేణికి టాటా ఏస్ మూలస్తంభంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఏస్ ప్రో ను ప్రారంభించడం టాటా మోటార్స్‌కు గర్వకారణమైన క్షణంగా పినాకి హవల్దార్ అభివర్ణించారు. ACE ప్రో 15శాతం మెరుగైన కార్యాచరణ సామర్థ్యంతో పాటు ఆదాయాన్ని 20–22శాతం పెంచుతుందని చెప్పారు. ఆకర్షణీయమైన స్కీమ్‌లతో బెస్ట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. అత్యంత సురక్షితమైన, నమ్మకమైన ఉత్పత్తిగా దీన్ని రూపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. చిన్న వ్యాపారుల మెరుగైన ఆర్థికాభివృద్ధికి నమ్మకమైన వాహనంగా టాటా ఏస్ నిలుస్తుందని తెలిపారు. చిన్నవ్యాపారులకు అవరసమైన తోడ్పాటును అందించేందుకు హైదరాబాద్‌లో ఏస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Published on: Jul 11, 2025 11:38 AM