Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వందే భారత్ రైళ్లపై అదిరిపోయే అప్డేట్..!

Updated on: Jan 22, 2026 | 12:42 PM

Indian Railways: ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. ఇక కొత్తగా స్లీపర్ రైళ్లు కూడా వస్తున్నాయి. అయితే రానున్న కాలంలో మరిన్ని వందే భారత్ సర్వీసులను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది. వీటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వందే భారత్ రైళ్లపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. 2030 నాటికి 800, 2047 నాటికి 4500 రైళ్లను అందుబాటులోకి తీసురావాలని యోచిస్తోంది. వీటి సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. పాత సాంప్రదాయ రైళ్ల స్థానంలో సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లను తీసుకొచ్చే దిశగా ముందుగు వేస్తోంది. రైల్వే వ్యవస్థలో ఇదొక పెద్ద అడుగుగా చెప్పవచ్చు

2 / 5
మెరుగైన సిగ్నలింగ్, పెద్ద టర్నోవర్ సామర్థ్యం ఆధారంగా తాయరీ యూనిట్లలో వందే భారత్ రైళ్ల ఉత్పత్తి జరుగుతుందని, దశలవారీగా 2030 నాటికి 800 రైళ్లను తీసుకొస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ట్రంక్ రూట్లలోని సాంప్రదాయ రైళ్లను సమర్థవంతమైన, వేగవంతమైన వందే భారత్ రైళ్లతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

3 / 5
2047 నాటికి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 100 సంత్సరాలు కానుంది. దీంతో అప్పటికల్లా దేశవ్యాప్తంతగా 4500 వందే భారత్ ట్రైన్లను తీసుకురానున్నట్లు రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని మార్గాలు, ప్రాంతాలను కవర్ చేసేలా వీటిని ప్రవేశపెడతామన్నారు. ఇక త్వరలో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

4 / 5
వందే భారత్ రైళ్లు చైర్ కార్ వేరియెంట్లతో ఆగవని, రాత్రిపూట ప్రయాణికుల కోసం స్లీపర్ రైళ్లు మరిన్ని వస్తాయని రైల్వేశాఖ తెలిపింది. మెరుగైన వేగం, అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతతో రైళ్లు వస్తాయన్నారు. ఇక నెక్ట్స్ జనరేషన్ వందే భారత్ రైళ్లపై కూడా దృష్టి పెట్టినట్లు తాజాగా రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

5 / 5
మేక్ ఇన్ ఇండియా, ఉపాధి కల్పనకు రైల్వే వ్యవస్థ ఉపయోగపడనుంది. దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడతాయి. రైళ్ల ఉత్పత్తికి పేరు పొందిన స్పెయిన్, చైనా దేశాల కంటే ఎక్కువ రైళ్లను తయారు చేస్తామని రైల్వేశాఖ చెప్పుకొచ్చింది. రైల్వే వ్యవస్థలో భారత్ అగ్రగామిగా మారడానికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.