గుజరాత్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి

Bridge Collapses : ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పూరాత వంతెనలు కుప్పకూలుతుండగా… కొన్ని చోట్ల కొత్తగా నిర్మించిన వంతెలు సైతం కొట్టుకపోతున్నాయి. అయితే ఇటీవల గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ఒక వంతెన భారీ వర్షాలకు కూలిపోయింది. జునాగఢ్ జిల్లాలోని బామ్నాసా గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఒక కాలవపై కొన్ని నెలల కిందట కొత్తగా ఓ వంతెనను నిర్మించారు. జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు […]

గుజరాత్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి
Follow us

|

Updated on: Jul 06, 2020 | 6:27 PM

Bridge Collapses : ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పూరాత వంతెనలు కుప్పకూలుతుండగా… కొన్ని చోట్ల కొత్తగా నిర్మించిన వంతెలు సైతం కొట్టుకపోతున్నాయి. అయితే ఇటీవల గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ఒక వంతెన భారీ వర్షాలకు కూలిపోయింది. జునాగఢ్ జిల్లాలోని బామ్నాసా గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఒక కాలవపై కొన్ని నెలల కిందట కొత్తగా ఓ వంతెనను నిర్మించారు. జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ వంతెన కూలి కొట్టుకు పోయింది.

వంతెన కొట్టుక పోయిన సమయంలో అటుగా వాహనాలు ప్రయాణించక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు కొత్త వంతెన కొన్ని నెలల్లోనే కూలిపోవడంపై బామ్నాసా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనను నాసిరకంగా నిర్మించారని వారు మండిపడుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.