ఎప్పటికీ నీవే నా కెప్టెన్…

టీమిండియా మాజీ సారథి, దిగ్గజ కెప్టెన్‌ ధోనీ రిటైర్మెంట్‌పై క్రికెట్‌ ప్రముఖులు ఇంకా స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ధోనీకి ...

ఎప్పటికీ నీవే నా కెప్టెన్...

Updated on: Aug 17, 2020 | 7:26 PM

You will always be my captain : టీమిండియా మాజీ సారథి, దిగ్గజ కెప్టెన్‌ ధోనీ రిటైర్మెంట్‌పై క్రికెట్‌ ప్రముఖులు ఇంకా స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ధోనీకి బీసీసీఐ(BCCI) భారీ వీడ్కోలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడి గురించి ఎవరేమన్నారో వీడియోలు రూపొందించి ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటోంది.

ఇందులో భాగంగా తొలుత విరాట్‌ కోహ్లీ భావోద్వేగంతో స్పందించిన వీడియోను పోస్టు చేసింది. కోహ్లీ మాట్లాడుతూ.. జీవితంలో పలు సందర్భాల్లో మాటలు రావని, అలాంటి క్షణాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నాడు.  భారత జట్టు ప్రయాణించే బస్సులో మహీ ఎప్పుడూ వెనుక సీటులో కూర్చునేవాడని, అలాగే జట్టు వెనుక అండగా ఉండి నడిపించాడని ప్రశంసించాడు.

అతడితో మంచి అనుబంధం ఉందని, ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. మాజీ సారథి తనని బాగా అర్థం చేసుకుంటాడని, అతనెప్పుడూ జట్టు విజయాల కోసమే పరితపించేవాడని తెలిపాడు. ఈ రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ భవిష్యత్తు‌ బాగుండాలని, ప్రశాంతంగా జీవించాలని కోహ్లీ ఆకాంక్షించాడు. చివరి మాటగా ఎప్పటికీ తనకు ధోనీయే కెప్టెన్‌ అని ముగించాడు.